Athmakur: అకాల వర్షంతో రైతులకు నష్టం

Athmakur: అకాల వర్షంతో రైతులకు నష్టం
x
Highlights

ఆరుకాలం కష్టపడి రైతు పండించిన పంటను అమ్ముకోవడానికి మార్కెట్ కి తీసుకొస్తే పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.

ఆత్మకూర్(ఎం): ఆరుకాలం కష్టపడి రైతు పండించిన పంటను అమ్ముకోవడానికి మార్కెట్ కి తీసుకొస్తే పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఆత్మకూర్(ఎం) సబ్ మార్కెట్ యార్డు కి దాదాపుగా నెల రోజులు గా ధాన్యం వస్తుండగా యార్డు ధాన్యం రాసులతో నిండిపోగా, ఎప్పుడు కొనుగోలు ప్రారంభం అవుతుందో అని కళ్ళల్లో వత్తులేసుకొని ఎదురుచూస్తున్న రైతులు అయితే బుధవారం సాయంత్రం కురిసిన అకాల వర్షంతో తడిసి ముద్దయిన ధాన్యం.

రాసులను చూసి మేము కష్టపడి పండించిన వరి ధాన్యం ఎండబోసి పట్టించి కుప్ప పోస్తే అధికారులు కొనుగోలు చేయక, వచ్చిన అకాల వర్షంతో తడిసిపోయాయి. మళ్లీ మేము ఎండపోయాలంటే ఎంత కష్టమో ఆలోచించండని దయచేసి అధికారులు తొందరగా కొనుగోళ్లు ప్రారంభించాలని, బయటి ప్రాంతాలలో కొనుగోళ్లు ప్రారంభించినప్పటికీ ఇంకా ఆత్మకూర్(ఎం) మండల సబ్ మార్కెట్ యార్డు లో ఎందుకు కొనుగోలు ప్రారంభించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు తొందరగా కొనుగోలు ప్రారంభించాలని అన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories