ఒక్క వర్షానికే కొండపోచమ్మ కాల్వలకు దెబ్బ

ఒక్క వర్షానికే కొండపోచమ్మ కాల్వలకు దెబ్బ
x
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవలే ప్రారంభించిన కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ కాల్వలకు వర్షం దెబ్బ తగిలింది.

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవలే ప్రారంభించిన కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ కాల్వలకు వర్షం దెబ్బ తగిలింది. గురువారం, శుక్రవారం కురిసిన భరీ వర్షాలకు రిజర్వాయర్ కాల్వల సిమెంట్‌ లైనింగ్‌ దెబ్బతిన్నది. ప్రధానంగా గజ్వేల్‌ మండలం కొడకండ్ల హెడ్‌ రెగ్యులేటరీ వద్ద సిమెంట్‌ లైనింగ్, మెట్లు దెబ్బతిన్నాయి. మర్కూక్‌ సమీపంలోనూ కాల్వ సిమెంట్‌ లైనింగ్‌ దెబ్బతిన్నది. అది మాత్రమేకాకుండా మారికొన్ని చోట్ల అక్కడక్కడా మట్టి కుంగిపోయి సిమెంట్‌ లైనింగ్‌ దెబ్బతినింది. దీంతో లీకేజీలు ఏర్పడే ప్రమాదం నెలకొంది.

కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ కాల్వలు నాగార్జునసాగర్‌ కాల్వల కంటే కూడా సామర్థ్యం పెద్దది. ఇంతటి కీలకమైన కాల్వ వర్షాలకు దెబ్బతినడం ఆందోళన కలిగిస్తోంది. కాల్వ నాణ్యత ప్రమాణాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ వ్యవహారంపై ఈఈ బద్రీనారాయణను నీటిపారుదల శాఖ వివరణ కోరింది. కాగా భారీ వర్షాల కారణంగానే నీటి ప్రవాహం పెరిగి కాల్వ దెబ్బతిన్న మాట వాస్తవమేనని ఈఈ స్పస్టం చేసారు. వెంటనే నీటి ప్రవాహానికి ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే మరమ్మతు చేయిస్తున్నామని స్పష్టం చేశారు.

కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి చేరేనీరు ముందుగా గోదావరి జలాలు మల్లన్నసాగర్‌ సర్జిపూల్‌ నుంచి తుక్కాపూర్‌ గ్రావిటీ కెనాల్‌ ద్వారా 24 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి. అక్కడి నుంచి గజ్వేల్‌ మండలం కొడకండ్ల వద్ద నిర్మించిన హెడ్‌రెగ్యులేటరీ వద్దకు చేరుకుంటాయి. అక్కడి గేట్లు ఎత్తితే అక్కడి నుంచి కాల్వల ద్వారా అక్కారం పంపుహౌజ్‌ వైపు మరో 6 కిలోమీటర్లు తరలివెళ్తాయి. మళ్లీ అక్కడి నుంచి మరో 6.5 కిలోమీటర్ల మేర మర్కూక్‌–2 పంపుహౌజ్‌ నుంచి కొండపోచమ్మకు చేరుతాయి. ఈ మల్లన్నసాగర్‌ సర్జిపూల్‌ నుంచి కొడకండ్ల వరకు ఉన్న ఈ కాల్వ సామర్థ్యం 11,500 క్యూసెక్కులు.

Show Full Article
Print Article
Next Story
More Stories