సింగరేణిలో నష్టాలను మిగిల్చిన భారీ వర్షాలు

Due to Heavy Rain Coal Production Decreased in Singareni
x

సింగరేణిలో నష్టాలను మిగిల్చిన భారీ వర్షాలు

Highlights

*సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లోకి వరద నీరు నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

Rains: తెలంగాణాలో సిరుల వేణిగా పేరుగాంచిన సింగరేణి నష్టాలని చవిచూసింది వరుసగా కురుస్తున్న వర్షాలు సింగరేణిని కోలుకోలేని నష్టాల్లో ముంచెత్తింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్శాలతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. బొగ్గు గనుల్లోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడిది. ఆశించిన లక్ష్యానికి ఉత్పత్తి కాకపోవడంతో గడిచిన ఇరవైరోజుల్లోనే సుమారు నాలుగువందల కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనాలు వేస్తున్నారు.

తెలంగాణా రాష్ట్రంలో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో సింగరేణి గనులు విస్తరించి ఉన్నాయి. లాభాల భాటలో కొనసాగుతున్న సింగరేణి గనులపై భారీ వర్షాల ప్రభావం పడింది. గడిచిన పదిహేను రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. అండర్ గ్రౌండ్ లో బొగ్గు ఉత్పత్తి పనులు యధావిథిగా కొనసాగుతున్నా ఓపెన్ కాస్టుల్లో మాత్రం ఆశించిన మేర బొగ్గు ఉత్పత్తి కావడం లేదు. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. బొగ్గు ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోయింది.

సింగరేణి ఓపెన్ కాస్టు ప్రదేశాల్లో భారీగా వర్షం పడుతుండడంతో గనుల్లో ,పని ప్రదేశాలు బొగ్గు ఉత్పత్తికి అనుకూలంగా లేకుండా పోయింది. ఓపెన్ కాస్టుల నుండి ,యంత్రాలను,టిప్పర్లను ఇప్పటికే రక్షిత ప్రదేశాలకు తరలించారు. వర్షప్రభావంతో సింగరేణి లక్ష్యం అంచనాలు తలకిందులయ్యాయి ఆర్జీ 1 ఆర్జీ2 ఆర్జీ 3, భూపాలపల్లి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, మణుగూరు రీజియన్లలో ఇరవై రోజుల్లో రోజుకు ఒక లక్ష 85 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి కావాల్సి ఉండగా కేవలం 97 వేల టన్నులు మాత్రమే ఉత్పత్తి జరిగింది. ఈ నెలలో ఇరవై రోజులకు 35.15లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి కావాల్సి ఉండగా కేవలం 18.46లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి జరిగింది. దీంతో ఇప్పటికే సుమారు నాలుగు వందల కోట్ల నష్టం వాటిల్లందని అధికారులు అంచనా వేస్తున్నారు. బొగ్గు ఉత్పత్తి సాధారణ స్థితికి రావాలంటే వర్షాలు పూర్తిగా తగ్గిపోవాలని అధికారులు చెబుతున్నారు.

మరోవైపు కావాలనే సింగరేణి లెక్కల్లో తప్పులు చెబుతున్నారనే ఆరోపణలను కూడా వినపడుతున్నాయి వాతవరణశాఖ హెచ్చరికల మేరకు ముందుగానే బొగ్గు ఉత్పత్తిని ఎక్కువగా చేసారని వర్షాల నష్టాన్ని కవర్ చేసేందుకు నిల్వల్ని ముందస్తుగానే పెంచుకున్నారంటు పలు యూనియన్లు ఆరోపిస్తున్నాయి సంస్థకి నష్టం వాటిల్లిడం కంటే..,కార్మికులకే ఇబ్బందులు వచ్చాయంటున్నారు ఆరోపణల ఎలా ఉన్నా చేయాల్సిన ఉత్పత్తి మాత్రం ఆగిపోయిన ద్రుశ్యాలు కనపడుతునే ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories