29న దుబ్బాక ఉపఎన్నిక షెడ్యూలు..? టీఆర్‌ఎస్ టిక్కెట్ వారికేనా?

29న దుబ్బాక ఉపఎన్నిక షెడ్యూలు..? టీఆర్‌ఎస్ టిక్కెట్ వారికేనా?
x
Highlights

దివంగత టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. దీంతో ఈ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది..

దివంగత టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. దీంతో ఈ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే శుక్రవారం బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. బీహార్ తోపాటు దుబ్బాక ఉపఎన్నిక షెడ్యూలు కూడా విడుదల అవుతుందని భావించారు. అయితే ఈ షెడ్యూల్ ఈ నెల 29న వెలువడే అవకాశం ఉందంటున్నారు అధికారులు. దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఒక లోక్‌సభ స్థానంతో పాటు, మరో 64 శాసనసభ స్థానాలకు ఉపఎన్నిక జరగాల్సి ఉంది. పోలింగ్‌ సమయంపై కొన్ని రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఈ నెల 29న సమీక్ష నిర్వహించి ఉప ఎన్నిక షెడ్యూలు ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.

కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంతో దుబ్బాక అసెంబ్లీ స్థానం ఉపఎన్నిక షెడ్యూలు ఆలస్యమైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 29న దీనిపై స్పష్టత రానుంది. ఇదిలావుంటే దుబ్బాక అసెంబ్లీ టిక్కెట్ ఎవరికిస్తారన్న దానిపై టిఆర్ఎస్ లో స్పష్టత లేదు. అయితే దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి భార్య సుజాతకు టికెట్‌ కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది, అంతేకాకుండా మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కొడుకు శ్రీనివాస్‌రెడ్డి కూడా టిఆర్ఎస్ టికెట్‌ ఆశిస్తున్నారు. షెడ్యూలు వెలువడిన తర్వాత పార్టీ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించాలని టీఆర్‌ఎస్‌ అధిష్టానం భావిస్తోంది. ఇక కాంగ్రెస్, బీజేపీలు కూడా తమ అభ్యర్థులను ప్రకటించలేదు. కాంగ్రెస్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన నాగేశ్వరరెడ్డి, బీజేపీ నుంచి పోటీ చేసిన రఘునందన్ రావు లు ఆయా పార్టీల నుంచి టిక్కెట్ ఆశిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories