దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిగా నర్సారెడ్డి!

దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిగా నర్సారెడ్డి!
x
Highlights

టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అయింది. నవంబర్ 3న దుబ్బాక ఉప ఎన్నికకు పోలింగ్..

టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అయింది. నవంబర్ 3న దుబ్బాక ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుండగా 10వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు. అయితే ఈ ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని టిఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుండగా.. ఈ ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అధికార పార్టీకంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ప్రచారబరిలో నిలవాలని భావిస్తున్నాయి. బీజేపీ నుంచి రఘునందన్ రావు అభ్యర్థిత్వం దాదాపు ఖరారు కాగా.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నుంచి సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అంతేకాదు దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిగా నర్సారెడ్డి పేరు దాదాపుగా ఖరారు అయినట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఈరోజు నర్సారెడ్డి పేరు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని గాంధీభవన్ వర్గాలు తెలియజేస్తున్నాయి. గత ఎన్నికల్లో పోటీ చేసిన మద్దుల నాగేశ్వర్ రెడ్డి పోటీకి సుముఖంగా లేకపోవడంతో నర్సారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. నర్సారెడ్డి అయితేనే అన్నివిధాలా బావుంటుందనే కాంగ్రెస్ పెద్దలు ఈ నిర్ణయానికి వచ్చారు. ఇదిలావుంటే టీఆర్ఎస్ అభ్యర్థిపై ఇంకా స్పష్టత రాలేదు. త్వరలో అభ్యర్థిని ఖరారు చేస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. రామలింగారెడ్డి భార్య లేదా కుమారుడు పోటీ బరిలో ఉంటారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈసారి కూడా తమదే విజయం అని టిఆర్ఎస్ నేతలు ధీమాగా చెబుతున్నారు. ఇటు అధికార పక్షానికి దుబ్బాక ప్రజలు షాక్ ఇవ్వబోతున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories