Hyderabad: గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌కు మందుబాబుల క్యూ

Drunk and Drivers Queue Line At Goshamahal Traffic Training Institute
x

Hyderabad: గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌కు మందుబాబుల క్యూ

Highlights

Hyderabad: రాచకొండ కమిషనరేట్ పరిధిలో 517 కేసులు

Hyderabad: న్యూ ఇయర్ రోజు ఆలయాల ముందు క్యూ లైన్ కంటే... గోషామహల్‌ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌ దగ్గరే రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. తాగి వాహనాలు నడపొద్దని హెచ్చరించినా పట్టించుకోకుండా డ్రైవ్ చేసిన మందుబాబులంతా ఇవాళ క్లాసుల కోసం క్యూ కట్టారు. వందలాది మంది కౌన్సిలింగ్‌ కోసం గోషామ‌హల్‌ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌‌కు వచ్చారు. దీంతో క్యూ ఇన్‌స్టిట్యూట్‌ కాంపౌండ్ దాటింది. రోడ్డు దాకా క్యూ కట్టడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది.

హైదరాబాద్‌లో న్యూ ఇ‍యర్ వేడుకల సందర్భంగా భారీ సంఖ్యలో మద్యం బాబులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దని చెప్పిన పోలీసుల ఆదేశాలను యువత బేఖాతరు చేశారు.ఈ క్రమంలో మద్యం మత్తులో వాహనాలు నడిపిన వారికి పోలీసులు గట్టి షాకిచ్చారు. మూడు కమిషనరేట్ల పరిధుల్లో దాదాపు 3 వేల మంది మందుబాబులు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షల్లో పట్టుబడ్డారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,241 మంది.. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,200 మంది.. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 517 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ దొరికిపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories