శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో 14 కేజిల బంగారం పట్టుకున్న DRI అధికారులు

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో 14 కేజిల బంగారం పట్టుకున్న DRI అధికారులు
x
gold
Highlights

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 14 కిలోల బంగారం పట్టుబడింది. దుబాయి నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 14 కిలోల బంగారం పట్టుబడింది. దుబాయి నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి ఈ బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్ ఇండియా విమానం ఏఐ952లో బంగారం అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలీజెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. విమానంలోని సీట్ల నెంబర్ 31ఏ, 32ఏ కింద 112 బంగారం బిస్కెట్లు ఉన్నట్లు గుర్తించారు. దక్షణ కొరియా, చైనాకు చెందిన ఇద్దరు పౌరులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బంగారం విలువ రూ. 5 కోట్ల 46 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితులపై 1962 కస్టమ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories