Choppadandi: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన డిఆర్డిఎ పీడీ

Choppadandi: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన డిఆర్డిఎ పీడీ
x
Highlights

మండలంలోని ఐకేపీ కేంద్రాలను డిఆర్డిఎ పిడి వెంకటేశ్వరరావు పరిశీలించారు.

చొప్పదండి: మండలంలోని ఐకేపీ కేంద్రాలను డిఆర్డిఎ పిడి వెంకటేశ్వరరావు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... తాలు, మట్టిపెళ్ళలు లేకుండా తడిచిన ధాన్యం కాకుండా తేమ లేకుండా, అరపెట్టిన ధాన్యాన్ని రైతులు ఐకేపీ సెంటర్ కి తీసుకురావాలి. సాధ్యమైనంత వరకు ఒకటి రెండు రోజుల్లో ధాన్యం కొనుగోలు చేసి నిర్వాహకులు మిల్లుకి పంపించాలి. అక్కడ మిల్లులో ఏమైనా మిల్లర్లు ఇబ్బంది పెడితే ప్రతి మిల్లుకో డి టి /ఆర్ ఐ ని ప్రత్యేక అధికారులుగా నియమించితే బాధ్యత వారు చూసుకుంటారు.

ఎక్కడ కూడ హమాళిల కొరత ఉండరాదు. లేదంటే చేస్తామన్న వారితో పని చేపించుకోవాలి. ప్రతి మిల్లు వారు సెంటర్ కి వాహనాలను పంపించాలని, వాహనాలు లేని పక్షంలో గ్రామంలో ఉన్న ట్రాక్టర్లని ఏర్పాటు చేసుకోవాలని, అలాగే ఐకేపీ సెంటర్ వారికి రైతులు సహకరించాలని సెంటర్ వారు కూడ రైతులకు సహకరించి సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఇట్టి కార్యక్రమంలో తహసీల్దార్ సరిత, ఎంపీడీఓ స్వాతి, ఎంపీపీ రవీందర్, ఐకేపీ ఏ పిఎం నర్మద, గిర్ధావర్, సర్పంచ్ గంగ మల్లయ్య, ఎంపీటీసీ తిరుపతి పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories