ఎన్ఎంసీ బిల్లును వ్యతిరేకిస్తూ వైద్యుల ఆందోళన

ఎన్ఎంసీ బిల్లును వ్యతిరేకిస్తూ వైద్యుల ఆందోళన
x
Highlights

కేంద్రప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లుకు వ్యతిరేకంగా డాక్టర్లు ఆందోళన బాట పట్టారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్...

కేంద్రప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లుకు వ్యతిరేకంగా డాక్టర్లు ఆందోళన బాట పట్టారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపుతో వైద్యులు ఓపీ సేవలు బహిష్కరించారు. ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వైద్యులు నిరసన చేపట్టారు. దశాబ్దాలుగా ఉన్న మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాను రద్దు చేసి, నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ ఏర్పాటును ఐఎంఏ మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. వైద్యులు ఆందోళన చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా నిరంకుశత్వంగా పార్లమెంటులో బిల్లును ఆమోదించిందని వైద్యులు ఆరోపిస్తున్నారు.

ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకిస్తూ నిమ్స్ లో డాక్టర్లు విధులు బహిష్కరించారు. వెంటనే బిల్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే విధంగా బిల్లు లో లోపాలున్నాయని ఒక సారి పునరాలోచన చేయాలంటున్నారు. ముఖ్యంగా డాక్టర్స్ ఫీజుల విషయం బ్రిడ్జ్ కోర్సుల విషయాన్నివ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. 24 గంటల సేవలు నిలిపి వేసినప్పటికీ అత్యవసర సేవలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నట్లు వైద్యులు చెప్పారు. హాస్పిటల్స్ లో ఓపీ సేవలు నిలిపి వేయడంతో దూర ప్రాంతాల నుండి వచ్చే పేషంట్లు కొంత ఇబ్బందికి గురయ్యారు. ముందుగా సమాచారం ఇవ్వకపోవడంతో ఆపరేషన్లు కోసం వచ్చిన వారు వెనుతిరిగి వెళ్లారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories