ప్రభుత్వాస్పత్రిలో వైద్యుల నిర్వాకం.. డెలివరీ చేసి మహిళ కడుపులో కాటన్‌ ప్యాడ్‌ మర్చిపోయిన డాక్టర్లు..

Doctors Leave Cotton Pad In Womans Stomach During Caesarean In Mancherial District
x

ప్రభుత్వాస్పత్రిలో వైద్యుల నిర్వాకం.. డెలివరీ చేసి మహిళ కడుపులో కాటన్‌ ప్యాడ్‌ మర్చిపోయిన డాక్టర్లు..

Highlights

Mancherial: నిన్న రాత్రి బాలింతకు తీవ్ర అస్వస్థత.. 108 అంబులెన్స్‌లో చెన్నూరు ప్రభుత్వాస్పత్రికి తరలింపు

Mancherial: మంచిర్యాల జిల్లా ప్రభుత్వాస్పత్రిలో వైద్యుల నిర్వాకం వెలుగులోకి వచ్చింది. డెలివరీ చేసి మహిళ కడుపులో కాటన్‌ ప్యాడ్‌ మర్చిపోయిన ఘటన.. కలకలం రేపుతోంది. వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామానికి చెందిన కీర్తిలయ అనే గిరిజన మహిళకు పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో గత ఐదు రోజుల క్రితం కాన్పు కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్‌ చేశారు. అయితే.. వైద్యులు చిన్న సర్జరీ చేసి డెలివరీ చేసి ఇంటికి పంపించారు.

నిన్న రాత్రి బాలింత తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమెను 108 అంబులెన్స్‌లో చెన్నూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కడుపులో కాటన్‌ ప్యాడ్‌ను గుర్తించిన వైద్యులు.. దానిని తొలగించారు. దీంతో.. డాక్టర్ల నిర్లక్ష్యంపై మండిపడుతున్న బాధితురాలి బంధువులు.. బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories