చలికాలంలో కరోనాతో జాగ్రత్త అంటోన్న డాక్టర్లు

చలికాలంలో కరోనాతో జాగ్రత్త అంటోన్న డాక్టర్లు
x
Highlights

కరోనా పట్ల రానున్న కాలంలో మరింత అప్రమత్తంగా ఉండక తప్పదా.. కాస్త తగ్గినట్లే తగ్గిన కరోనా మళ్లీ విజృంభిస్తుందా..? వింటర్ సీజన్‌లో కరోనాతో పాటు కాచుకు కూర్చున్న రోగాలేంటి..?

కరోనా పట్ల రానున్న కాలంలో మరింత అప్రమత్తంగా ఉండక తప్పదా.. కాస్త తగ్గినట్లే తగ్గిన కరోనా మళ్లీ విజృంభిస్తుందా..? వింటర్ సీజన్‌లో కరోనాతో పాటు కాచుకు కూర్చున్న రోగాలేంటి..? కరోనా సెకండ్ వేవ్‌ వస్తే పరిస్థితేంటి..? డాక్టర్లు ఏమంటున్నారు. వాచ్‌ దిస్ స్టోరీ

వైరస్,బ్యాక్టీరియాలు పంజా విసరడానికి అనుకూలమైన సీజన్‌ చలికాలం. ఇప్పటికే ఈ వింటర్ సీజన్‌ వచ్చేసింది. ఏటా ఈ సీజన్‌ వస్తే చాలు ఎన్నో రోగాలు కలవరపెడుతుంటాయి. వీటికి తోడు ఈ సారి కరోనా మరింత భయపెడుతోంది. అయితే గతంతో పోలిస్తే ఈ సారి సీజనల్ వ్యాధులు తక్కువగానే నమోదయ్యాయంటున్నారు వైద్యులు. కానీ ఈ సమయంలో కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిందే అంటున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే అంతమాత్రాన కరోనా ప్రభావం తగ్గిపోయిందనుకుంటే పొరపాటే అంటున్నారు వైద్యులు. కేసులు తగ్గాయే తప్ప.. కరోనా మననుంచి వెళ్ళిపోలేదని గుర్తుంచుకోవాలంటున్నారు. కోవిడ్ నియంత్రణ చర్యలను నిర్లక్ష్యం చేస్తే.. ప్రాణాలకు ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లే అని హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికే యూరప్‌ దేశాలను సెకండ్ వేవ్ వణికిస్తోంది. కేరళలో కూడా సెకండ్ వేవ్‌ ఓనం రూపంలో షాక్ ఇచ్చింది. దీంతో ఈ సీజన్‌లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని సూచిస్తున్నారు డాక్టర్లు. కరోనా స్టార్టింగ్‌ స్టేజ్‌లో తీసుకున్న జాగ్రత్తలను తప్పక పాటిస్తేనే.. నియంత్రణ సాధ్యమని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories