ఎట్టకేలకు గది నుంచి బయటకు వచ్చిన డాక్టర్ వసంత్..!

* ఎమ్మెల్యే రాజాసింగ్ హామీతో బయటకు వచ్చిన డాక్టర్

R Tripura Malini
Published on: 7 Dec 2022 1:44 PM IST
Doctor Protest At Sultan Bazar UPHC For Three Days
X

ఎట్టకేలకు గది నుంచి బయటకు వచ్చిన డాక్టర్ వసంత్

Sulthan Bazaar: హైదరాబాద్ సుల్తాన్ బజార్ UPHCలో మూడు రోజులుగా నిరసన చేస్తున్న డాక్టర్ ఎట్టకేలకు బయటకు వచ్చారు. కరోనాకు మందు కనిపెట్టినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని పెట్రోల్ బాటిల్‌ పట్టుకుని నిరసనకు దిగిన డాక్టర్ వసంత్ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాజాసింగ్ UPHCకు వెళ్లారు. రూమ్ బయట నుంచే డాక్టర్‌తో మాట్లాడిన రాజాసింగ్ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే మాటలతో కన్విన్స్ అయిన డాక్టర్ వసంత్ బయటకు వచ్చి నిమ్మరసం తాగి నిరసన విరమించారు. ఇటు ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వివరించానని ఆయన హైదరాబాద్ రాగానే డాక్టర్‌ను కలిసి మాట్లాడతానని కిషన్ రెడ్డి చెప్పారని రాజాసింగ్ చెప్పుకొచ్చారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story