Narayanpet: వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ లకు హెచ్చరిక: జిల్లా ఎస్పీ చేతన

Narayanpet: వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ లకు హెచ్చరిక: జిల్లా ఎస్పీ చేతన
x
District SP Chetana
Highlights

నారాయణపేట కరోనా వైరస్ పై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డా.చేతన హెచ్చరించారు.

నారాయణపేట కరోనా వైరస్ పై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డా.చేతన హెచ్చరించారు. కరోనా వైరస్ వ్యాధి పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పెద్దఎత్తున చర్యలు తీసుకుంటున్నది.

కానీ కొందరు ఆకతాయిలు వార్త ఛానల్ బ్రేకింగ్ పేరుతో, కంప్యూటర్లు గ్రాఫిక్స్ తయారుచేసి సామాజిక మాధ్యమాలలో వాట్సాప్ గ్రూప్ లో ఫేస్ బుక్ లోపోస్ట్ చేసి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అలాంటి వారిని గుర్తించి సైబర్ క్రైమ్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. వాట్సాప్ గ్రూప్ లో ఏదైనా అంశం పోస్ట్ చేసే ముందు, ఒకటికి రెండుసార్లు ఆలోచించి పోస్ట్ చేయాలని ఎస్పీ తెలిపారు. వాట్సప్ ఫేస్ బుక్ గ్రూప్ అడ్మిన్ పరిపక్వతతో ఆలోచించగలిగిన వాడై ఉండాలి.

గ్రూపులో ప్రతి పోస్ట్ కి బాధ్యత తీసుకోవాలి. అలాగే గ్రూపులో యాడ్ చేసే ప్రతి సభ్యుడు అడ్మిన్ కు తెలిసి ఉండాలి. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే వెంటనే గ్రూప్ నుంచి తొలగించాలి. ఆ వివాదాస్పద పోస్టింగ్ కు సంబంధించి అడ్మిన్ ఏం చర్యలు తీసుకోకుంటే, అతనిపై పోలీసులు చర్యలు తీసుకుంటారు. అడ్మిన్ వివాదాస్పద పోస్ట్ చేస్తే ఈ చట్టం ఐపిసి సెక్షన్ 153 ఏ కింద శిక్ష విధిస్తారు. 3 నుంచి 5 వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. వివాదాస్పద వ్యక్తులకు గ్రూప్ లో చోటు ఇవ్వకూడదు.

అలాగే వివాదాస్పద పోస్టులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. వాటిని చేసిన సభ్యులను వెంటనే తొలగించాలని, గ్రూప్ కి సంబంధించి నిబంధనలు పెట్టుకుని అందరూ పాటించాలని, నిరంతరం గ్రూపులో షేర్ అవుతున్న అంశాలను పరిశీలించాలని, పై అంశాలను ప్రతి ఒక్కరు పాటించి సోషల్ మిడియాలో వదంతులను రాకుండా జాగ్రత్త తీసుకోవాలని ఎస్పీ చేతన సూచించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories