Rythu Bandhu: నేటి నుంచి తెలంగాణలో రైతు బంధు నిధుల పంపిణీ

Distribution Of Rythu Bandhu Funds In Telangana From Today
x

Rythu Bandhu: నేటి నుంచి తెలంగాణలో రైతు బంధు నిధుల పంపిణీ

Highlights

Rythu Bandhu: రైతుల ఖాతాల్లో నగదు జమచేయనున్న తెలంగాణ సర్కార్‌

Rythu Bandhu: తెలంగాణలో రైతులకు యాసంగి సీజన్లో పెట్టుబడి సాయం అందించేందుకు సర్కారు సమాయాత్తమైంది. ఒక్కో ఎకరానికి ఐదు వేలరూపాయల చొప్పున పెట్టుబడి సాయాన్ని రైతు బంధు పథకం ద్వారా అందించాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఇవాళ్టినుంచి రైతుల బ్యాంకు ఖాతాలో నేరుగా ఆర్థిక సాయాన్ని జమచేస్తారు.

పదో విడత రైతుబంధు ద్వారా కోటి 53 లక్షల 53 వేల ఎకరాలకు యాసంగి రైతుబంధు సాయం అందించేందుకు చర్యలు చేపట్టారు. దీంతో 7వేల676 కోట్ల 61 లక్షల రూపాయలు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. ఈ పథకం ద్వారా 70లక్షల54 వేల మంది రైతులు లబ్ధి పొందబోతున్నారు. గత వానాకాలం అర్హులైన రైతులు 64 లక్షల 99వేల 323 మంది ఉండగా కొత్తగా ఈ ఏడాది డిసెంబర్ 20లోపు రిజిస్టేషన్ చేసుకున్న వారితో రైతుల సంఖ్య 70లక్షల54 వేలకు చేరుకుంది. ఈసారి పెరిగిన రైతులతో ప్రభుత్వంపై రెండు వందల కోట్ల రూపాయలు అదనపు భారం పడింది.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ రైతుబంధు నిధుల విడుదలపై అధికారిక ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ఆర్థికశాఖ రైతుల జాబితా ప్రకారం బ్యాంకుల ద్వారా యాసంగి పెట్టుబడి సాయం అందించే విధంగా చర్యలు చేపట్టింది. తొలిప్రాధాన్యతానుసారం ఎకరా భూమి ఉన్న రైతులకు ఆర్థిక సాయం అందిస్తారు. ఆతర్వాత రెండెకరాల మాగాణి ఉన్న రైతులకు సాయం చేస్తారు. తర్వాతి దశలో మూడెకరాలున్న రైతుల జాబితాప్రకారం రైతుబంధు సాయం జమచేస్తారు. తెలంగాణాలో ఐదెకరాలలోపు భూమి ఉన్న రైతులు 95 శాతం మంది ఉన్నారని అధికారుల సమాచారం.

అదే విధంగా ప్రతి ఏడాది రాష్ట్రంలో 5 ఎకరాల పైబడిన వారికి రైతు బంధు ఎందుకు అంటూ ప్రభుత్వం పైన విమర్శలు వస్తున్న సీఎం పట్టించుకోవడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వలన్న డిమాండ్ ఉన్న ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా మూడో వంతు కౌలు రైతులుగా ఉన్నట్లు తెలుస్తోంది. అంటే రాష్ట్రంలో ప్రతి ముగ్గురు రైతుల్లో ఒకరు కౌలుదారే.

ఆరు ఎకరాల నుండి పది ఎకరాలు వరకు కలిగి ఉన్న ఐదు లక్షల 3561 పైగా ఉన్నారు. ఇక పది నుండి15 ఎకరాల లోపు ఉన్న రైతులు ఒక లక్ష 25,624 మంది ఉన్నారు. అదే విధంగా ఇరవై ఎకరాలు ఉన్న రైతులు 17 వేల మంది ఉన్నారు. 30ఎకరాలు ఉన్న రైతులు 29,342మంది ఉన్నారు. 50ఎకరాలు ఉన్నవాళ్లు 3,714 మంది రైతులు , 54 ఎకరాలు ఉన్న వాళ్ళు 598 మంది ఉన్నారు మొత్తంగా.

Show Full Article
Print Article
Next Story
More Stories