8న జరగబోయే సార్వత్రిక సమ్మె సందర్భంగా కరపత్రాల పంపిణీ

8న జరగబోయే సార్వత్రిక సమ్మె సందర్భంగా కరపత్రాల పంపిణీ
x
Highlights

బస్టాండ్ ఆవరణలో ఉన్న ఆటో స్టాండ్ లో ఆటో కార్మికులతో ఈనెల 8న జరగబోయే సార్వత్రిక సమ్మెలో ఆటో డ్రైవర్స్ విస్తృతంగా పాల్గొనాలని కరపత్రాలు పంచి ప్రచారం చేశారు.

మక్తల్: బస్టాండ్ ఆవరణలో ఉన్న ఆటో స్టాండ్ లో ఆటో కార్మికులతో ఈనెల 8న జరగబోయే సార్వత్రిక సమ్మెలో ఆటో డ్రైవర్స్ విస్తృతంగా పాల్గొనాలని కరపత్రాలు పంచి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి కిరణ్, దత్తాత్రేయ అడ్వకేట్ మాట్లాడుతూ... మోటార్ వెహికల్ చట్టం - 2019 ఆటో డ్రైవర్లకు శర ఘాతకంగా మారిందన్నారు. ప్రపంచ దేశాలను దృష్టిలో ఉంచుకొని తెచ్చిన ఈ చట్టం భారతదేశ ఆటో డ్రైవర్లకు తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెడుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అమలు కాకున్నా రాబోయే రోజుల్లో ఆటో డ్రైవర్ల పట్ల నిరంకుశంగా ఉంటుందన్నారు.

మోటార్ వెహికల్ చట్టం - 2019 లో జరిమానాలు పది రెట్లు పెరిగాయన్నారు. పాత చట్టం ప్రకారం నో పార్కింగ్ కు రూ.100/-రూపాయలు ఉంటే ప్రస్తుతం రూ.1000 చేశారన్నారు. సిగ్నల్ జంప్ కు రూ.100/- నుండి రూ.1000/- రూపాయలు, ఇన్సూరెన్సు లేనందుకు రూ.5000/- రూపాయలు, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే రూ.5000/- రూపాయలు, పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోతే రూ.1000/- రూపాయలు తదితర అంశాలు మోటార్ వెహికల్ చట్టం 2019 లో ఉన్నవి. అమలు జరిగితే ఇవి రోజువారీగా పని చేసుకుని జీవించే ఆటోడ్రైవర్లకు పెను భారంగా మారుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్స్ నాగరాజు, తాజుద్దీన్, కుర్వశేఖర్, హైమద్ అలీ, అజిజుల్లా, ఖలీల్, హమీద్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories