దిశ కేసులో కీలకంగా మారిన ఫోన్‌.. మహ్మద్‌ ఆరిఫ్‌ దిశతో ఏం మాట్లాడాడు..?

దిశ కేసులో కీలకంగా మారిన ఫోన్‌.. మహ్మద్‌ ఆరిఫ్‌ దిశతో ఏం మాట్లాడాడు..?
x
Highlights

వెటర్నరీ డాక్టర్‌ అత్యాచారం, హత్య కేసులో ఫోన్‌ కీలకంగా మారింది. దిశ మొబైల్‌ను మంటల్లో తగలబెట్టారా..? లేదా నిందితులు ఆ ఫోన్‌ను ఎక్కడైనా దాచి పెట్టారా...

వెటర్నరీ డాక్టర్‌ అత్యాచారం, హత్య కేసులో ఫోన్‌ కీలకంగా మారింది. దిశ మొబైల్‌ను మంటల్లో తగలబెట్టారా..? లేదా నిందితులు ఆ ఫోన్‌ను ఎక్కడైనా దాచి పెట్టారా అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏ వన్‌ నిందితుడిగా ఉన్న మహ్మద్ అరిఫ్‌తో దిశ మాట్లాడుతుండగా ఇద్దరు నిందితులు ఆమెను డైవర్ట్‌ చేసి చెట్ల పొదల్లోకి లాక్కెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు దొరక్కుండా ఉండాలనే దిశ ఫోన్‌ను మాయం చేసి ఉంటారని తెలుస్తోంది.

అయితే దిశ ఫోన్‌లో ఆటోమెటిక్‌ వాయిస్‌ రికార్డ్‌ ఉందని భావించిన నిందితులు ఆ ఫోన్‌ను మాయం చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. దిశ ఫోన్‌ దొరికితే ఏవన్‌గా ఉన్న నిందితుడు ఆరిఫ్‌ ఏం మాట్లాడాడనే అంశాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మొన్న షాద్‌నగర్ పీఎస్‌లో విచారణ నేపథ్యంలో నిందితులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆన్సర్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు దిశ ఫోన్‌ ఎక్కడుందనే అంశంపై ప్రధానంగా ఫోకస్‌ చేసినట్లు సమాచారం.

నిందితులను పది రోజుల కస్టడీకి ఇస్తే దిశను తగలబెట్టిన షాద్‌నగర్‌కు తరలించి సీన్‌ టూ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేయనున్నారు. అయితే విచారణను మొత్తం పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచాలని భావిస్తున్నారు. షాద్‌నగర్‌ కోర్టు అనుమతిస్తే సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేయడానికి నిందితులను భద్రత దృష్ట్యా భారీ బందోబస్తు మధ్య తరలించే అవకాశాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories