రెండు రోజుల్లో దిశతో రావాలనుకున్నాం.. కానీ అస్తికలతో వచ్చాను

రెండు రోజుల్లో దిశతో రావాలనుకున్నాం.. కానీ అస్తికలతో వచ్చాను
x
Highlights

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యోదంతంపై నిందితులకు మరణశిక్ష విధించాలని ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ఈ ఘటనపై పలువురు ప్రముఖులు కూడా...

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యోదంతంపై నిందితులకు మరణశిక్ష విధించాలని ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ఈ ఘటనపై పలువురు ప్రముఖులు కూడా స్పందించారు. కఠిన చట్టాలు తెవాలని పార్లమెంట్‌లోనూ తీవ్ర చర్చ నడిచింది. ఇదిలా ఉంటే దిశ కుటుంబ సభ్యులు ఎవరినీ ఇంటికి తాళం వేశారు. వారు ఎవరి కలిసేందుకు ఇష్టపడడం లేదు.

తాజాగా దిశ కుటుంబ సభ్యులు ఆమె అంత్యక్రియలు పూర్తిచేసి అస్థికలను గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని బీచుపల్లి వద్ద కృష్ణానదిలో కలిపారు. ఈ సందర్భంగా దిశ తండ్రి మాట్లాడారు... రెండుమూడు రోజుల్లో తమ కుమార్తె దిశతో కలిసి ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవాలని భావించామని, కానీ చివరికి దిశ అస్థికలను ఇక్కడ కలపాల్సి వచ్చిందని కన్నీరుమున్నీరైయ్యారు. దోషులను నడిరోడ్డుపై కాల్చి చంపాలని డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories