శ్రీశైలం దేవస్థానం పరిధిలో ట్రాఫిక్ సమస్య నియంత్రణపై చర్చ

Discussion on Control of Traffic Problems in Srisailam Devasthanam
x

శ్రీశైలం దేవస్థానం పరిధిలో ట్రాఫిక్ సమస్య నియంత్రణపై చర్చ

Highlights

Srisailam: ఆలయ చైర్మన్‌ చక్రపాణి, ఈవో పెద్దిరాజు అధ్యక్షతన సమావేశం

Srisailam: నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం పరిధిలో ట్రాఫిక్ సమస్య నియంత్రణ చర్యలపై ఆలయ చైర్మన్ చక్రపాణి రెడ్డి, ఈవో పెద్దిరాజు సమావేశం నిర్వహించారు. సెలవులు, పర్వదిన రోజులలో ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారని, ఈ నేపథ్యంలో క్షేత్రపరిధిలో ట్రాఫిక్ సమస్య నెలకొంటుందని ఆలయ చైర్మన్‌ చక్రపాణి అన్నారు. ట్రాఫిక్ నియంత్రణకై క్షేత్రపరిధిలో మరికొన్ని వాహన పార్కింగ్ ప్రదేశాలు, రూట్ డైవర్షన్స్, సూచిక బోర్డులు, పబ్లిక్ అవుట్‌ పోస్టులు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

క్షేత్రపరిధిలో ట్రాఫిక్ నియంత్రించేందుకు సరియైన ప్రణాళికలను రూపొందించి.. అమలు చేయనున్నట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. అదేవిధంగా వాహనాలు బ్రేక్ డౌన్ అయినప్పుడు వాటిని తొలగించేందుకు క్రేన్లను ఏర్పాటు చేసుకోవాలని, దేవస్థానం ప్రైవేటు సెక్యూరిటీని కూడా పెంచాలని కోరారు. అదనంగా మరో 50 మంది హోమ్ గార్డులను నియమించుకోవాలని డీఎస్పీ సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories