TS Traffic Challan: నేటితో ముగియనున్న ట్రాఫిక్‌‌‌‌ పెండింగ్ చలాన్ల డిస్కౌంట్

Discount On Traffic Pending Challans Ending Today
x

TS Traffic Challan: నేటితో ముగియనున్న ట్రాఫిక్‌‌‌‌ పెండింగ్ చలాన్ల డిస్కౌంట్

Highlights

TS Traffic Challan: పెండింగ్ చలాన్లు ఉంటే చెల్లించాలంటున్న ట్రాఫిక్ పోలీసులు

TS Traffic Challan: ట్రాఫిక్‌‌‌‌ పెండింగ్ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన డిస్కౌంట్‌‌‌‌ నేటీతో ముగియనుంది. గత నెల 26న ప్రారంభమైన ఈ ఆఫర్‌కు భారీ స్పందన వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్ చలాళ్లు ఉండగా.. నిన్నటి వరకు 1.14 కోట్ల చలాన్స్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌ పరిథిలో చలాన్లను వాహనదారులు క్లియర్ చేసినట్లు తెలుస్తోంది‌. పెండింగ్ చలాన్లను చెల్లించడానికి ఇవాళ్టితో సమయం ముగుస్తుండటంతో వాహనదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఆర్టీసీ బస్సులుపై పెండింగ్‌లో ఉన్న చలాన్లపై 90 శాతం రాయితీని ప్రకటించగా.. బైక్‌లపై 80 శాతం, ఫోర్ వీలర్స్, ఆటోలకు 60 శాతం, ట్రక్కులు, ఇతర భారీ వాహనాలకు 50 శాతం తగ్గింపుతో భారీ రాయితీ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.

Show Full Article
Print Article
Next Story
More Stories