సీఎం కేసీఆర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి

Discharge From CM KCR Hospital | TS News Today
x

సీఎం కేసీఆర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి

Highlights

*ఇంటికి చేరుకున్న ముఖ్యమంత్రి..వారం రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని వైద్యుల సూచన

CM KCR: సీఎం కేసీఆర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి వారం రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. లెఫ్ట్‌ హ్యాండ్‌ చేతి వైపు నొప్పిగా ఉందని సీఎం కేసీఆర్‌ చెప్పడంతో ఇంటికి వెళ్లి వైద్య పరీక్షలు చేశామన్నారు. యాంజియోగ్రామ్ చేశామని, ఎలాంటి బ్లాక్స్ లేవని తెలిపారు వైద్యులు. కార్డియో వైపు నుంచి కూడా ఎలాంటి సమస్యలు లేవని.. బ్రెయిన్ MRI టెస్ట్ కూడా చేశామన్నారు వైద్యులు. బీపీ, షుగర్ నార్మల్ గా ఉందని ప్రస్తుతం సీఎంకు ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు వెల్లడించారు. నెల నెల వైద్య పరీక్షలు చేస్తామని తెలిపారు డాక్టర్లు. అలాగే వారం రోజులకు ఒకసారి షుగర్‌ టెస్ట్‌లు చేసుకోవాలని వైద్యులు సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories