Sircilla - Dhobi Ghat: సిరిసిల్లలో అధికారుల నిర్లక్ష్యం బట్టబయలు

Dhobi Ghat at Sircilla Drowned in Water due to Heavy Rains before Opening | Telugu Online News
x

Sircilla - Dhobi Ghat: సిరిసిల్లలో అధికారుల నిర్లక్ష్యం బట్టబయలు

Highlights

Sircilla - Dhobi Ghat: *వెంకంపేటలో రజకుల కోసం దోబీఘాట్‌ నిర్మాణం *రూ.కోటి 5లక్షల నిధులతో దోబీఘాట్‌ ఏర్పాటు

Sircilla - Dhobi Ghat: సిరిసిల్ల పట్టణంలో నేత కార్మికులకు బతుకమ్మ చీరల ద్వారా ఉపాధి కల్పిస్తున్న ప్రభుత్వం.. ఇతర వృత్తులపై ఆధారపడినవారికి కూడా ఉపాది కల్పించాలని సంకల్పించింది. పట్టణంలోని వెంకంపేటలో రజకుల కోసం కోటి ఐదు లక్షల నిధులతో రాష్ట్రంలోనే మొట్టమొదటి ఆధునిక దోబీ ఘాట్ నిర్మాణం చేపట్టింది. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా మరి కొన్నిరోజుల్లో ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.

అయితే.. ఇదే సమయంలో భారీ వర్షాలు కురవడంతో దోబీఘాట్‌ జలమయమైంది. దీంతో.. అధికారుల డొల్లతనం మరోసారి బట్టబయలైంది. పెద్దబోనాల చెరువుల నుంచి వచ్చే నీరు.. సిరిసిల్ల కొత్త చెరువును కలుపుతూ ఉండగా, దీనిని స్థానికులు ఊదర వాగుగా పిలుచుకుంటారు. మత్తడి కాలువలు కలిసే చోటనే ఈ ఆధునిక దోబీ ఘాట్ నిర్మాణం జరిపారు. నెలలోపే రెండుసార్లు వరద దోబీఘాట్‌ను ముంచెత్తింది. ప్రారంభోత్సవానికి ముందే దోబీఘాట్‌ కట్టడాలకు పగుళ్లు వచ్చాయి. అంతేకాకుండా.. వరదనీరు లోపలికి చేరుకోవడంతో ఆధునాతన యంత్రాలు నీట మునిగాయి.

దోబీఘాట్‌ నిర్మాణం కోసం వెచ్చించిన కోట్ల రూపాయలను కాలువలో పోసినట్టుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజాధనం దుర్వినియోగం అయ్యేటట్టు వ్యవహరించిన కాంట్రాక్టర్‌, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories