ధర్మపురి అసెంబ్లీ స్ట్రాంగ్ రూమ్ తాళాల మిసింగ్‌పై నేడు హైకోర్టులో విచారణ

Dharmapuri Strong Room Missing Keys Case Hearing In High Court Today
x

ధర్మపురి అసెంబ్లీ స్ట్రాంగ్ రూమ్ తాళాల మిసింగ్‌పై నేడు హైకోర్టులో విచారణ 

Highlights

* తాళాల అంశంపై నేడు ఆదేశాలు జారీ చేయనున్న కోర్టు

Dharmapuri: జగిత్యా జిల్లా ధర్మపురి అసెంబ్లీ స్ట్రాంగ్ రూమ్ తాళాల మిసింగ్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. తాళాల అంశంపై నేడు ఆదేశాలు జారీ చేయనుంది. తాళం పగలకొట్టి స్ట్రాంగ్ రూమ్ తెరిచేందుకు సిద్ధమని హైకోర్టుకి నివేదించింది ఎన్నికల సంఘం. పిటిషనర్ అభ్యంతరం వల్లే ఆలస్యమని కోర్టుకి నివేదిక ఇచ్చారు. అయితే తన అభిప్రాయం ఏంటో చెప్పాలంటూ పిటిషనర్ అడ్లూరి లక్ష్మణ్‌కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక తప్పుడు ఆరోపణలతో కేసు వేశారంటున్నారు మంత్రి కొప్పుల తరఫు న్యాయవాదులు. ఇదిలా ఉండగా.. తాళం మిస్సింగ్ అంశంపై కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ ద్వారా ఫిర్యాదు చేసింది.

ధర్మపురి నియోజకవర్గం కౌంటింగ్‌లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ నేత అడ్లూరి ల క్ష్మణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై విచారించిన హైకోర్టు స్ట్రాంగ్ రూముల ను ఓపెన్ చేసి పూర్తి డాక్యుమెంట్లను స మ ర్పించాల ని ఆదేశించింది. ఈ నేప థ్యంలో ఎన్నిక ల రిట ర్నింగ్ అధికారి భిక్షప తి, జ గిత్యాల జిల్లా క లెక్టర్ షేక్ యాస్మిన్ బాషా నేతృత్వంలో స్ట్రాంగ్ రూములను తెరిచేందుకు ప్రయ త్నించారు. అయితే, మూడు స్ట్రాంగ్ రూముల్లో ఒక రూము తాళం మాత్రమే ఉండ టంతో మొద టి గ ది త లుపులు తెరిచారు. రెండు మూడు గ దుల తాళాలు లేక పోవ డంతో ఆ గ దుల ను తెర వ లేక పోయారు.

స్ట్రాంగ్ రూముల‌ను బ‌ద్దలు కొట్టి తెర‌వాల‌ని క‌లెక్టర్ చెప్పగా అందుకు కాంగ్రెస్ నేత‌లు అభ్యంత‌రం వ్యక్తం చేశారు. కావాల‌నే తాళం మాయం చేసి ఉంటార‌నే అనుమానాలు వ్యక్తం చేశారు. తెరిచిన గ‌దులు 108 నుండి 269 వ‌ర‌కు ఉన్న పోలింగ్ కేంద్రాల ఓటింగ్ మిషిన్లు భ‌ద్రంగా ఉన్నాయ‌ని, మిగతా రెండు గ‌దుల తాళాలు లేక‌పోవ‌డంతో తెరుచుకోలేద‌ని హైకోర్టుకు నివేదిక‌లు ఇస్తామ‌ని అన్నారు. అయితే ప‌థ‌కం ప్రకార‌మే తాళాల‌ను మాయం చేశార‌ని, క‌లెక్టర్ వ‌ద్ద ఉండాల్సిన తాళాలు ఏమైయ్యాయ‌ని కాంగ్రెస్ నేత అడ్లూరి ఆరోపించారు.



Show Full Article
Print Article
Next Story
More Stories