యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

X
Highlights
ఆదివారం కావడంతో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఈ సందర్బంగా ఆలయ అధికారులు భక్తులకు లఘు దర్శన సౌకర్యం కల్పిస్తున్నారు
admin13 Dec 2020 11:30 AM GMT
ఆదివారం కావడంతో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఈ సందర్బంగా ఆలయ అధికారులు భక్తులకు లఘు దర్శన సౌకర్యం కల్పిస్తున్నారు. కార్తిక మాసం కావడంతో యాదాద్రి సన్నిధిలో భక్తులు సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించుకోవడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మరోవైపు ఆలయ పరిసరాలు, ప్రసాదం కౌంటర్లు, కళ్యాణ మండపం, దర్శన క్యూలైన్లు, కళ్యాణ కట్ట, వసతి గృహ సముదాయాల వద్ద భక్తులు బారులు తీరారు. అలాగే కోవిడ్ నేపథ్యంలో థర్మల్ స్క్రీనింగ్, శానిటైజేషన్ అనంతరమే గుడి ప్రవేశానికి భక్తులను అనుమతిస్తున్నారు.
Web TitleDevotees lined up for the darshan of Yadadri Srilaxmi Narasimha swamy
Next Story