Sammakka Sarakka: మేడారానికి పోటెత్తిన భక్తులు.. రద్దీగా మారిన రహదారులు

Devotees flock to Medaram Sammakka Sarakka Jatara
x

Sammakka Sarakka: మేడారానికి పోటెత్తిన భక్తులు.. రద్దీగా మారిన రహదారులు 

Highlights

Sammakka Sarakka: ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసుల చర్యలు

Sammakka Sarakka: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఉదయం నుండి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు బంగారం, చీర సారెలు సమర్పించుకుంటున్నారు. భక్తులు భారీగా తరలిరావడంతో జంపన్నవాగు, ఐటీడీఏ క్యాంప్ ఆఫీస్, ఆర్టీసీ బస్టాండ్ రోడ్లు రద్దీగా మారాయి. మేడారం మహా జాతర ఈ నెల 21 నుండి 24 వరకు జరుగనున్న నేపథ్యంలో ముందస్తు మొక్కల్లో భాగంగా లక్షల సంఖ్యలో భక్తులు మేడారం చేరుకుంటున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories