మేడారంలో ఎండోమెంట్ ఆధ్వర్యంలో 3కోట్లతో అభివృద్ధి పనులు

మేడారంలో ఎండోమెంట్ ఆధ్వర్యంలో 3కోట్లతో అభివృద్ధి పనులు
x
ఈఓ రాజేందర్, ఏఈ దుర్గా ప్రసాద్, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, పూజారులు
Highlights

మండలం మేడారం మహాజాతరకు వనదేవతలను దర్శించుకుంటానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ఏండోమెంట్ శాఖ బుధవారం శ్రీకారం చుట్టింది.

తాడ్వాయి: మండలం మేడారం మహాజాతరకు వనదేవతలను దర్శించుకుంటానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ఏండోమెంట్ శాఖ బుధవారం శ్రీకారం చుట్టింది.ఇందులో భాగంగా ఏండోమెంట్ ఈఓ రాజేందర్, ఏఈ దుర్గా ప్రసాద్, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, పూజారులు, కాంట్రాక్టర్లు మేడారంలో పనులు మంచిగా పూర్తి అయి జాతరలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మంచిగా జరగాలని సమ్మక్క-సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 5నుంచి 8వరకు జరుగు మేడారం మహా జాతరకు కోటిన్నర పైచిలుకు భక్తులు వచ్చే అవకాశం ఉందని, వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ఏండోమెంట్ శాఖ ద్వారా మూడు కోట్ల రూపాయలతో పలు పనులు చేపడుతున్నామన్నారు. 44లక్షలతో మేడారం, కన్నెపల్లి గ్రామాలలో రెండు పిలిగ్రిమ్ షెడ్లు, 19 లక్షలతో ఓపెన్ డ్రయిన్, సెప్టక్ ట్యాంకు, 6 లక్షలతో వాటర్ సప్లై పైపులైన్లు, 10లక్షలతో కాటేజీలు,కాంపౌండ్ వాల్, 88లక్షలతో లైటింగ్ సిస్టమ్,48లక్షలతో తడక పందిళ్లు, 45లక్షలతో టెంట్లు, 19లక్షలతో క్యూలైన్ల మరమ్మతులు, 19లక్షలతో పెయింటింగ్స్ పనులు నిర్వహించుతున్నట్లు తెలిపారు.

గత జాతరలో కంటే ఈ సారి జాతరకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పూజారులు కొక్కెర క్రిష్ణయ్య, చంద గోపాల్, కాక సారయ్య, కాక కిరణ్, ముణెందర్, పెనక బుచ్చి రాములు, పెనక మురళి, సురేందర్, మల్లెల ముత్తయ్య, బొక్కెన్న, అరుణ్, ఏండోమెంట్ అధికారులు క్రాంతి, రాజేశ్వర్ రావు, వీరన్న, మధు, రఘుపతి, రమాదేవి, కాంట్రాక్టర్లు రాజునాయక్, సారయ్య లు పాల్గొన్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories