25 గ్రామాల్లో సోలార్ కరెంట్ - డిప్యూటీ సీఎం

bhatti vikramarka
x

bhatti vikramarka

Highlights

Bhatti Vikramarka: 25 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టి సోలార్ కరెంట్ ఇచ్చేందుకు కృషి చేస్తామని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క హామీ ఇచ్చారు.

Bhatti Vikramarka: తమ ప్రభుత్వం కేవలం రుణమాఫీ చేయటమే కాదు.. పెండింగ్‌లో ఉన్న రైతుల ఇన్‌ష్యూరెన్స్‌ కూడా తమ ప్రభుత్వమే కడుతుందని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క హామీ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మార్కెట్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలోభట్టి మాట్లాడారు. గత ప్రభుత్వంలో లాగా రైతులను తాము గాలికి వదిలేయలేమని.. ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా.. ఎదుర్కొంటామని భట్టి అన్నారు. 2029 వరకూ 20 వేల మెగావాట్ల పవర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. త్వరలో 25 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టి సోలార్ కరెంట్ ఇస్తామని వెల్లడించారు. రైతులకు అవసరమైన పంప్ సెట్‌లకు సోలార్ కరెంట్ సప్లై చేస్తామని తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories