దీప్తి మృతి కేసులో వీడని మిస్టరీ.. కీలకం కానున్న పోస్టుమార్టం రిపోర్ట్

Deepti Death Is A Mystery
x

దీప్తి మృతి కేసులో వీడని మిస్టరీ.. కీలకం కానున్న పోస్టుమార్టం రిపోర్ట్

Highlights

Death Mystery: చందన ఆడియోను క్రాస్ చెక్ చేస్తున్న పోలీసులు

Death Mystery: జగిత్యాల జిల్లా కోరుట్లలో కలకలం సృష్టించిన దీప్తి మృతి కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. సోమవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన దీప్తి ఇంట్లో విగతజీవిగా పడి ఉంది. అయితే దీప్తి మృతి కేసులో పోస్ట్ మార్టం రిపోర్టు కీలకం కానున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే దీప్తి శరీరంపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. ఇంట్లో మద్యం తాగి పడిపోయిందన్న దీప్తి చెల్లి చందన వాయిస్ మెసేజ్ మరిన్ని అనుమానాలకు తెర లేపింది. మరో వైపు మద్యం పార్టీ అనంతరం చందన ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో ఆమెపై అనుమానాలు కలుగుతున్నాయి.

అక్కను తానెందుకు చంపుతానంటూ చందన తన తమ్ముడికి పంపించిన వాయిస్ మెసేజ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే వాయిస్ మెసేజ్‌పై పోలీసులు ఫోకస్ పెట్టారు. అందులో ఉన్న వాయిస్ ఎవరిదనే దానిపై గుర్తించే ప్రక్రియలో నిమగ్నమయ్యారు. మరో వైపు దీప్తి చెల్లి చందన ఆచూకీ కోసం పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు. అయితే కోరుట్ల బస్టాండ్‌లోని సీసీ ఫుటేజీలో కనిపించిన అమ్మాయిని దీప్తి చెల్లిగా భావించారు. తర్వాత ఆమె కాదని నిర్ధారించారు. అసలు దీప్తి మరణం తర్వాత చందన ఇంటి నుంచి ఎందుకు వెళ్లింది, ఎక్కడకు వెళ్లిందనే అంశం ఇప్పుడు పోలీసులకు సవాల్‌గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories