KRMB Meeting: నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నీటి పంపకాల బాధ్యత KRMBకే అప్పగిస్తూ నిర్ణయం

Decision Entrusting The Responsibility Of Water Supply Of Nagarjuna Sagar and Srisailam Projects To KRMB
x

KRMB Meeting: నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నీటి పంపకాల బాధ్యత KRMBకే అప్పగిస్తూ నిర్ణయం 

Highlights

KRMB Meeting: శ్రీశైలం డ్యాం నిర్వహణ బాధ్యత ఆంధ్రప్రదే‌శ్‌కు అప్పగింత

KRMB Meeting: నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణ ఇకపై కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ చేపట్టనుంది. జలమండలిలో జరిగిన సమావేశంలో ఉన్నతాధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి అటు ఏపీ ఇరిగేషన్ అధికారులతో పాటు ఇటు తెలంగాణ నీటిపారుదల అధికారులు హాజరయ్యారు. ప్రస్తుతం త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలోనే నీటి పంపకాలు జరుగుతాయని.. అయితే.. ఆపరేటింగ్ పూర్తి బాధ్యతలు మాత్రం KRMB కే అప్పగిస్తూ.. నిర్ణయం తీసుకున్నట్టు తెలంగాణ అధికారులు తెలిపారు.

KRMBకి కావాల్సిన సిబ్బందిని ఇటు తెలంగాణ, అటు ఏపీ సమానంగా నియమించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే.. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలుపై ఇంకా పూర్తి నిర్ణయం తీసుకోలేదని.. వాటిపై ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలంగాణ అధికారులు తెలిపారు. నాగార్జున సాగర్ డ్యాం నిర్వహణ తెలంగాణ చూసుకుంటే.. శ్రీశైలం డ్యాం నిర్వహణ ఆంధ్రప్రదేశ్ చూసుకుంటుందని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories