kaleshwaram project: కాళేశ‌్వరం విచారణపై ముగిసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిటి గడువు

Deadline for Justice Pinaki Chandra Ghosh Committee on Kaleshwaram Investigation
x

kaleshwaram project: కాళేశ‌్వరం విచారణపై ముగిసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిటి గడువు 

Highlights

kaleshwaram project: మరో రెండు నెలలు పొడగిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ కమిషన్‌ విచారణ చేపట్టింది. అయితే.. నేటితో కమిషన్ గడువు ముగియటంతో.. కమిషన్‌ గడువును ప్రభుత్వం మరో రెండు నెలలు పొడిగించింది. అక్టోబర్‌ నెలాఖరు వరకు పొడిగిస్తూ నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పీసీ ఘోష్‌ నేతృత్వంలో ప్రభుత్వం కమిషన్‌ ఏర్పాటు చేసింది. జూన్‌లోనే కమిషన్‌ విచారణ గడువు ముగియగా.. రెండు నెలలు పొడిగించారు. ఆగస్టు 31తో ఆ గడువూ ముగిసింది. అయినా, విచారణ పూర్తి కాకపోవడంతో మరో రెండు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories