Rangareddy: మంటల్లో శరీరం.. హత్య కోణంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

Dead Body Found in Near By Dream Valley Resort In Rangareddy District
x

Rangareddy: మంటల్లో శరీరం.. హత్య కోణంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

Highlights

Rangareddy: రంగంలోకి దిగిన క్లూస్‌ టీమ్స్‌, స్థానికులను విచారిస్తున్న పోలీసులు

Rangareddy: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలంలోని బాకారం గ్రామ శివార్లలో దారుణం చోటుచేసుకుంది. డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ పక్కన మంటల్లో కాలిపోతున్న బాడీ కలకలం రేపుతోంది. రిసార్ట్ పక్కన ఖాళీ ప్రదేశంలో కాలుతున్న మహిళ బాడీని చూసి పోలీసులకు సమాచారమిచ్చారు స్థానికులు. దాంతో ఘటనా స్థలానికి వెళ్లి మంటలార్పారు పోలీసులు. హత్య కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. రంగంలోకి దిగిన క్లూస్‌ టీమ్స్‌ స్థానికులను విచారిస్తున్నారు. ఎవరైనా హత్య చేసి దహనం చేశారా? లేక అక్కడే హత్య చేసి దహనం చేశారా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. మృతదేహం పక్కన సగం కాలిన ఫోన్ ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు వివరాలు ఆరా తీస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories