క్లబ్‌ డ్యాన్సర్‌ బట్టలు విప్పి, పళ్లతో రక్కి అసభ్యకరంగా..

క్లబ్‌ డ్యాన్సర్‌ బట్టలు విప్పి, పళ్లతో రక్కి అసభ్యకరంగా..
x
Highlights

హైదరాబాద్‌లో ఓ క్లబ్‌ డ్యాన్సర్‌పై నిన్న రాత్రి దాడి జరిగింది. లెస్బాన్‌ క్లబ్‌‌ అయిపోయిన తర్వాత అందులో పనిచేస్తున్న డ్యాన్సర్లపై అక్కడి సిబ్బందిలో...

హైదరాబాద్‌లో ఓ క్లబ్‌ డ్యాన్సర్‌పై నిన్న రాత్రి దాడి జరిగింది. లెస్బాన్‌ క్లబ్‌‌ అయిపోయిన తర్వాత అందులో పనిచేస్తున్న డ్యాన్సర్లపై అక్కడి సిబ్బందిలో కొందరు అసభ్యంగా ప్రవర్తించారు. డ్యాన్సర్‌‌ని కస్టమర్ల దగ్గరికి వెళ్లాలని సూచించారు. దీంతో ఆ యువతి తాను అలాంటి అసాంఘిక కార్యక్రమాలకు అంగీకరించనని వారించింది. వెంటనే సిబ్బంది యువతిపై బ్లేడ్‌తో దాడి చేసి, అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై బాధిత యువతి పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

అయితే తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వాళ్లంతా తమకు ఓ ఎమ్మెల్యే తమ్ముడు తెలుసునని బెదిరించారని డ్యాన్సర్‌ వాపోయింది. రాత్రి ఒంటిగంట సమయంలో నలుగురు అమ్మాయిలు, మరో వ్యక్తి కలిసి తనపై దాడి చేశారని, సిద్ధూ అనే వ్యక్తి వాళ్లందరికీ బాస్‌ అని, క్లబ్‌లో చాలా మంది బాధితులు ఉన్నారని యువతి తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు త్వరలో నిందితులను పట్టుకుంటామన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories