logo
తెలంగాణ

Dalita Bandhu: హుజురాబాద్‌తో పాటు మరో 4 మండలాల్లో దళితబంధు అమలు

Dalita Bandhu to Another Four Mandal with Huzurabad
X

సీఎం కెసిఆర్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Highlights

Dalita Bandhu:వెల్లువెత్తిన రాజకీయ విమర్శనలకు చెక్‌ పెట్టిన సీఎం

Dalita Bandhu: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధును పకడ్బందీగా అమలు చేయడానికి చర్యలు చేపడుతోంది. ప్రతి దళితున్ని ఆదుకోవడానికి మరో అడుగు ముందుకు వేసింది. మొదటగా ఫైలెట్ ప్రాజెక్టు‌గా హుజురాబాద్‌ని ఎంపిక చేసిన నేపథ్యంలో రాజకీయ విమర్శలకు కారణమైంది. సీఎం తాజాగా మరో 4 మండలాల్లో దళితబంధు అమలుకు ఆదేశించడంతో ఇప్పుడు విమర్శకులకు చెక్ పెట్టినట్లు అయింది.

దళితబంధు పైలట్ ప్రాజెక్టు హుజురాబాద్‌లో ప్రారంభం అయింది. రాజకీయ విమర్శల్ని చెక్‌ పెట్టేందుకు సీఎం కేసీఆర్ మరో నాలుగు మండలాల్లో పథకం అమలకు నిర్ణయం తీసుకున్నారు. మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం, తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం, అచ్చంపేట - కల్వకుర్తి నియోజకవర్గాల్లోని చారగొండ మండలం, జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్ మండలాల్లో దళితబంధు పథకాన్ని హుజూరాబాద్‌తో పాటు పైలట్ ప్రాజెక్టుగా చేపడుతామని ఇటీవలే సీఎం కేసీఆర్ ప్రకటించారు.

కొత్తగా ఈ నాలుగు మండలాల్లో పథకం అమలుకు సంబంధించి చేపట్టాల్సిన కార్యాచరణ కోసం ఈ నెల 13న సన్నాహక సమావేశాన్ని నిర్వహించనున్నట్టు సీఎం కెసిఆర్ తెలిపారు. ఈ సమావేశంలో ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన మంత్రులు, జిల్లాపరిషత్ చైర్మన్లు, కలెక్టర్లు పాల్గొంటారు. ఇందులో మధిర, తుంగతుర్తి, అచ్చంపేట, కల్వకుర్తి, జుక్కల్ నియోజవర్గాల శాసన సభ్యులు, ఎస్సీ కులాల అభివృద్ధి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్, ఎస్సీ డెవలప్‌మెంట్ శాఖ కార్యదర్శి, సీఎం సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఫెనాన్స్ సెక్రటరీ పాల్గొంటారు.

ఈ సన్నాహక సమావేశంలో పథకం తీరుతెన్నులను వివరించేందుకు క్షేత్రస్థాయి అనుభవం కలిగిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ ప్రత్యేక ఆహ్వానితులుగా పొల్గొంటారని సిఎం తెలిపారు. మొత్తానికి ఈ మీటింగ్‌తో దళిత‌బంధు పథకం మరింత వేగవంతంగా అమల్లోకి వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

Web TitleDalita Bandhu to Another Four Mandal with Huzurabad
Next Story