దళితబంధుపై కేసీఆర్ కీలక నిర్ణయం.. ఆ నాలుగు మండలాల్లోనె దళితబంధు పథకం అమలు

Dalita Bandhu Scheme Implementation in Only 4 Mandals in Telangana
x

సీఎం కెసిఆర్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Dalita Bandhu: దళితబంధు పథకాన్ని ఒక ఉద్యమంలా చేపట్టిన రాష్ట్రప్రభుత్వం * పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌లో దళితబంధు పథకం అమలు

Dalita Bandhu: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టా్త్మకంగా చేపట్టిన దళిత బంధు పథకాన్ని ఒక ఉద్యమంలా చేపట్టిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌లో దళితబంధు పథకాన్ని ముందు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో దళితబంధు పథకం అమలు తీరు, దాని లోతుపాతులను, దళిత ప్రజల మనోభావాలను, వారి అవసరాలను పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు..

రాష్ట్రంలోని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ భాగాల్లో ఉన్న, దళిత శాసన సభ్యుల ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లోని 4 మండలాలను ఎంపిక చేశారు. ఆ మండలాల్లో అన్ని కుటుంబాలకు.. హుజూరాబాద్‌తో పాటు దళితబంధును అమలు చేయాలని సీఎం నిర్ణయించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి.. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని చారగొండ. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్ మండలాలకు దళితబంధును వర్తింపచేయనున్నారు. సీఎం ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఆయా జిల్లాల మంత్రులు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్లతో హైదరాబాద్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఆ సమావేశంలో నిర్ణయాలు తీసుకుని ఈ నాలుగు మండలాల్లో దళితబంధు పథకాన్ని అమలు చేయనున్నారు..

Show Full Article
Print Article
Next Story
More Stories