Top
logo

ఆ బాలుడికి ఒళ్లంతా పవరే..బాడీకి టచ్ చేస్తే వెలుగుతున్న బల్బ్

ఆ బాలుడికి ఒళ్లంతా పవరే..బాడీకి టచ్ చేస్తే వెలుగుతున్న బల్బ్
Highlights

ఓ బల్బు వెలుగాలంటే అందుకు కరెంట్.. లేదా ఇన్వయిటర్ కావాలి కానీ మనిషి శరీరానికి బల్బును టచ్ చేస్తే అది...

ఓ బల్బు వెలుగాలంటే అందుకు కరెంట్.. లేదా ఇన్వయిటర్ కావాలి కానీ మనిషి శరీరానికి బల్బును టచ్ చేస్తే అది వెలుగుతుందా...? అంటే కాదనే సమాధానం వస్తుంది కదూ... బల్బ్ ‌ఏంటి... బాడికి టచ్ చేస్తే వెలగడమేంటి...? అని అనుకుంటున్నారా....? కానీ ఆదిలాబాద్ జిల్లాలో ఓ కుర్రాడికి ఒళ్లంతా కరెంటే అతని బాడీకి ఎక్కడ బల్బ్ పెట్టి టచ్ చేసినా అది జిగేల్ మంటూ వెలిగిపోతోంది అదెలా సాధ్యమనుకుంటున్నారా ఇది వినడానికే వింతగా ఉంది కదా నిజమండి.

ఈ బుడతడి పేరు సమీర్ ఆదిలాబాద్ జిల్లా బేలా మండలం సర్సన్న గ్రామానికి చెందిన ఈ బాలుడి శరీరంలో ఏముందో తెలియదు కానీ ఇతని బాడీకి బల్బ్ టచ్ చేస్తే చాలు అది వెలిగిపోతోంది శరీరంలోని ఏ భాగంలో బల్బ్ టచ్ చేసినా అది జిగేల్‌మంటూ వెలుగుతోంది. ఇది చూసిన వారంతా ఔరా ఏమి చిత్రం అంటున్నారు.

వారం రోజుల క్రితం సమీర్ తండ్రి చాంద్ పాషా ఇంట్లో బల్బు కోసమని అక్కడున్న షాపుకు వెళ్లాడు. ఓ ఎల్ఈడీ బల్బును కొని ఇంటికి తీసుకొచ్చాడు. బల్బు హోల్డర్లలో అమర్చే ముందు దాన్ని సమీర్ చేతిలో పెట్టాడు అంతే ఎలాంటి కరెంట్ కనెక్షన్ లేకపోయినా బల్బు ఒక్కసారిగా సమీర్ చేతిలో వెలిగిపోయింది.

Next Story