Top
logo

ఇండ్ల మధ్య మొసలి కలకలం

ఇండ్ల మధ్య మొసలి కలకలం
X
Highlights

సాధారణంగా ఇండ్లలోకి బల్లులు, పిల్లులు, కుక్కలు వస్తుండడం సహజం. ఇవి మాత్రమే కాకుండా అప్పుడప్పుడు జెర్రులు,...

సాధారణంగా ఇండ్లలోకి బల్లులు, పిల్లులు, కుక్కలు వస్తుండడం సహజం. ఇవి మాత్రమే కాకుండా అప్పుడప్పుడు జెర్రులు, పాములు లాంటి విషప్రాణులు కాలనీలలో, ఇండ్లలోకి వస్తుంటాయి. ఆ విషపురుగులు కనిపిస్తేనే చాలు ప్రజలు హడలెత్తి పోయి పరుగులు తీస్తారు. అలాంటిది ఏకంగా మనుషులను మింగే ప్రాణులే ఇండ్లలోకి వస్తే అప్పుడు వారి పరిస్థితి ఏంటి. వారు ఎంతటి భయాందోళనలకు గురవుతారు. ఆలోచిస్తుంటేనే ఒక్కసారిగా భయం వేస్తుంది కదూ.. ఇక నేరుగా ఆ పరిస్థిని ఎదుర్కొన్న వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. అసలు ఏంటి ఏ ప్రాణి, ఎవరి ఇంట్లోకి చొరబడింది అనుకుంటున్నారా. ఒకే అసలు విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వ‌న‌ప‌ర్తి జిల్లా పెబ్బేరు మండ‌లం రంగాపురంలో మంగ‌ళ‌వారం ఓ మొసలి కలకలం రేపింది. జూరాల కాలువకి చేరువలోనే గ్రామం ఉండడంతో మొసలి మెళ్లిగా జనావాసంలోకి చేరుకుంది. దాన్ని గమనించిన గ్రామస్థులు వెంటనే అప్ర‌మ‌త్త‌మైన మొస‌లిని బంధించారు. ఆ తరువాత అటవీ శాఖ అధికారుల‌కు స‌మాచారం అందించారు. ఇదిలా ఉండగా కొద్ది రోజుల క్రితం ఇదే విధంగా ఓ కొండ చిలువ కూడా ప్రజల మద్యలోకి వచ్చి కలకలం రేపింది. కొత్తకోట మండలం జాతీయ ర‌హ‌దారి పక్కనే ఉన్న హైలెట్ దాబా వెనకాల పొలంలో ఈ నెల 7వ తేదీన ట్రాక్టర్‌తో దున్నుతుండగా నాగేళ్లకు పెద్ద‌ కొండచిలువ త‌గిలింది. సంఘటనా స్థలానికి చేరుకున్న కృష్ణ సాగ‌ర్ దాదాపు 13 ఫీట్ల పొడవు 25 కేజీల బరువు ఉన్న పెద్ద కొండచిలువను అతి కష్టం మీద బంధించాడు.

Web Titlecrocodile captured at rangapuram village in wanaparthy district telangana
Next Story