CPM: కాంగ్రెస్‌కు కటీఫ్‌ చెప్పిన సీపీఎం.. ఒంటరిగా బరిలో దిగేందుకు నిర్ణయం

CPM Has Cut Off Alliance To Congress
x

CPM: కాంగ్రెస్‌కు కటీఫ్‌ చెప్పిన సీపీఎం.. ఒంటరిగా బరిలో దిగేందుకు నిర్ణయం

Highlights

CPM: తెలంగాణలో 17 స్థానాల్లో పోటీకి సీపీఎం సిద్ధం

CPM: కాంగ్రెస్‌కు సీపీఎం కటీఫ్‌ చెప్పింది. ఈ సారి ఎన్నికల బరిలో ఒంటరిగా దిగాలని కమ్యూనిస్ట్‌ పార్టీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో 17 స్థానాల్లో పోటీకి సీపీఎం సిద్ధమైంది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, మెదక్‌, హైదరాబాద్‌ జిల్లాల్లో సీపీఎం పోటీకి దిగనుంది. ఇందులో భాగంగా భద్రాచలం, అశ్వరావుపేట, పాలేరు, మధిర, వైరా, ఖమ్మం, సత్తుపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, నకిరేకల్, భువనగిరి, హుజూర్‌నగర్‌, కోదాడ, జనగామ, ఇబ్రహీంపట్నం, పటాన్‌చెరు, ముషీరాబాద్‌లో ఎన్నికల బరిలో నిలవనుంది సీపీఎం. అయితే.. అభ్యర్థులు ఎవరనేది మాత్రం ఇంకా ప్రకటించలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories