Top
logo

Telangana: సిద్ధిపేట జిల్లాలో గోవధ కలకలం

Cow Slaughter Issue in Siddipet District
X

సిద్దిపేట గోవధ నిరసన 

Highlights

Telangana: పౌల్ట్రీఫామ్‌లో గోవులతో వ్యాపారం చేస్తోన్న దుండగులు * ఆందోళన చేపట్టిన బీజేపీ, హిందూ సంఘాలు

Telangana: గుట్టు చప్పుడు కాకుండా గోవధకు పాల్పడుతూ జేబులు నింపుకుంటున్న సంఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో వెలుగుచూసింది. ఓ పౌల్ట్రీఫామ్‌లో 18 ఆవులను ఊచకోత కోసి వ్యాపారం చేస్తున్నారు గుర్తు తెలియని వ్యక్తులు. దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీహెచ్‌పీ, భజరంగ్ దళ్, బీజేపి నేతలు గో వధను అడ్డుకుని ఆందోళన చేపట్టారు.

పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో పోలీసులకు హిందూ సంఘాలకు మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. గోవధ చేసిన దుండగులను కఠినంగా శిక్షించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు హిందూ సంఘాల నేతలు. ఇక గోవధ జరుగుతుంటే స్థానిక పోలీసులు, మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ఎమ్మెల్యే రాజాసింగ్. నిందితులందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Web TitleTelangana: Cow Slaughter Issue in Siddipet District
Next Story