సిద్దిపేటలో కరోనా కలకలం..తొమ్మిదో తరగతి విద్యార్థికి పాజిటివ్

సిద్దిపేటలో కరోనా కలకలం..తొమ్మిదో తరగతి విద్యార్థికి పాజిటివ్
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

సిద్దిపేట జిల్లాలో కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాచింది. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని అటాక్ చేస్తుంది. ఈ కోణంలోనే తొమ్మిదో తరగతి చదువుతున్న...

సిద్దిపేట జిల్లాలో కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాచింది. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని అటాక్ చేస్తుంది. ఈ కోణంలోనే తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలుడిని కూడా అటాక్ చేసింది. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల పరిధిలోని జంగంపల్లి గ్రామానికి చెందిన తొమ్మిదో తరగతి బాలుడు గత కొన్ని రోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. కాగా అతని కుటుంబ సభ్యులు ఇరవై రోజుల నుంచి హైదరాబాద్ లోని ఎంఎన్ జే క్యాన్సర్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. కాగా అతనికి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా వైరస్ సోకిందని మిరుదొడ్డి, భూంపల్లి దవాఖాన వైద్యాధికారి మల్లికార్జున్ వెల్లడించారు. దీంతోకుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఒక్క సారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ విషయం తెలిసిన వెంటనే అధికారులు అప్రమత్తమయి బాలున్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతని కుటుంబ సభ్యులను క్వారంటైన్ చేసారు.

తెలంగాణలో గత కొద్దీ రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. మొన్న(మంగళవారం) ఒక్క రోజే 178 కేసులు నమోదయ్యాయి. నిన్న అధికంగా 191కేసులు నమోదయ్యాయి. నిన్న జీహెచ్ఎంసీ పరిధిలో 143, మేడ్చల్‌లో 11, సంగారెడ్డిలో 11, రంగారెడ్డిలో 8, మహబూబ్ నగర్లో 4, జగిత్యాల 3, మెదక్ జిల్లాల్లో 3, నాగర్ కర్నూల్2, కరీంనగర్‌లో 2, నిజామాబాద్ 1, వికారాబాద్ 1, నల్గొండ 1, సిద్దిపేట జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. 8 మంది కరోనాతో మృతి. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో పోరాడి 156 మంది మరణించారు. దినికి సంబంధించిన హెల్త్ బులిటెన్ ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 4,111కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,138 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక అటు కరోనాతో పోరాడి ఇప్పటివరకు 1,817 మంది డిశ్చార్జ్ అయ్యారు.

భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 9,985 కేసులు నమోదు కాగా,279 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 2,76,583 కేసులు నమోదయ్యాయి.

ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,33,632 ఉండగా, 1,35,205 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 7,745 మంది కరోనా వ్యాధితో మరణించారు. మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 50,61,332 కరోనా టెస్టులు. గడిచిన 24 గంటల్లో1,45,216టెస్టులు నిర్వహణ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories