Covid Vaccine: తెలంగాణలో నేటి నుంచి టీనేజర్లకు కోవిడ్‌ టీకా

Covid Vaccine: తెలంగాణ వ్యాప్తంగా నేటి నుండి టీనేజర్లకు కోవిడ్‌ టీకాల పంపిణీ ప్రారంభమైంది.

Shireesha
Published on: 3 Jan 2022 8:03 AM IST
Covid Vaccine for Teenagers from Today 03 01 2022 in Telangana | Corona Live Updates
X

Covid Vaccine: తెలంగాణలో నేటి నుంచి టీనేజర్లకు కోవిడ్‌ టీకా

Covid Vaccine: తెలంగాణ వ్యాప్తంగా నేటి నుండి టీనేజర్లకు కోవిడ్‌ టీకాల పంపిణీ ప్రారంభమైంది. రాష్ట్రంలో 15 నుంచి 18 ఏళ్ల వయసు వారికి ఉదయం 9గంటల నుంచే వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. ఈ వయసు టీనేజర్లందరికీ కొవాగ్జిన్‌ టీకాను మాత్రమే అందిస్తున్నట్లు తెలుస్తోంది. తొలిడోసు స్వీకరించిన 4 వారాల తర్వాత రెండో డోసును అందించనున్నట్లు డీహెచ్‌ తెలిపారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ ఈ టీకాలు అందుబాటులో ఉంటాయన్నారు.

జీహెచ్‌ఎంసీ, 12 మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధుల్లో లబ్ధిదారులకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకుంటేనే టీకాలిస్తారు. మిగిలిన తెలంగాణ జిల్లాలకు చెందిన పిల్లలకు ఆఫ్‌లైన్‌లో అంటే నేరుగా వ్యాక్సిన్‌ కేంద్రానికి వచ్చి టీకా తీసుకోవచ్చు. వీరికోసం గ్రామీణ, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రుల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు.

టీనేజర్లకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభిస్తున్నందున జాగ్రత్తలన్నీ తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. ఇతర వయసుల వారికి వేసే టీకాలు ఇందులో కలిసిపోకుండా.. పిల్లల కోసం ప్రత్యేక వ్యాక్సినేషన్‌ కేంద్రాలు పెట్టాలని స్పష్టం చేశారు. అదేవిధంగా తల్లిదండ్రుల సమక్షంలో వ్యాక్సిన్లు వేయాలని తెలియజేసింది.

Shireesha

Shireesha

Next Story