యూకే రిటర్న్స్‌లో పెరుగుతున్న కరోనా కేసులు

యూకే రిటర్న్స్‌లో పెరుగుతున్న కరోనా కేసులు
x
Highlights

తెలంగాణ యూకే రిటర్న్స్‌ల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో తెలంగాణ వైద్యశాఖ అప్రమత్తమైంది. తాజాగా యూకే నుంచి వచ్చిన మరో ఇద్దరికి కరోనా నిర్ధారణ...

తెలంగాణ యూకే రిటర్న్స్‌ల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో తెలంగాణ వైద్యశాఖ అప్రమత్తమైంది. తాజాగా యూకే నుంచి వచ్చిన మరో ఇద్దరికి కరోనా నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకు మొత్తం 20 కరోనా కేసులు నమోదయ్యాయి. మరీ వీరందరికీ కొత్త స్ట్రెయినా.. లేదా పాత వైరస్సా. అని తేల్చేందుకు వైద్యశాఖ నమూనాలను సేకరించింది. సీసీఎంబీ నుంచి రిపోర్ట్స్ రాగానే.. ఏ వైరస్సో తేల్చనున్నారు అధికారులు.

వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణ వైద్యశాఖ సీరియస్‌గా చర్యలు చేపడుతోంది. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ విధానాన్ని వేగంగా అమలు పరుస్తోంది. డిసెంబర్ 9 నుంచి ఇప్పటి వరకు 1,216 మంది యూకే నుంచి తెలంగాణకు వచ్చారు. వీరిలో 970 మందిని గుర్తించి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 20 మందికి కరోనా కన్ఫాం అయ్యింది. వీరంత వివిధ ఆస్పత్రుల్లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. యూకే నుంచి వచ్చిన వారిలో 92 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. ఇంకా 154 మంది ట్రేస్ కావాల్సి ఉంది. డిసెంబర్ 9 తర్వాత UK నుంచి, రాష్ట్రానికి వచ్చిన వారు దయచేసి వివరాలను వెల్లడించాలని కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories