Covid Call Center in Telangana: తెలంగాణలో కరోనా కాల్ సెంటర్ సేవలు!

Covid Call Center in Telangana: తెలంగాణలో కరోనా కాల్ సెంటర్ సేవలు!
x
Covid Call Center in Telangana
Highlights

Covid Call Center in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య దావానంలా విస్తరిస్తున్నాయి.

Covid Call Center in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య దావానంలా విస్తరిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ప్రతి రోజు వేలల్లో నమోదవుతున్నాయి. అయితే వారిలో చాలా మంది ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంటున్న పటికి మరి కొంత మంది మాత్రం వారి వారి ఇంట్లోనే ఉంటూ వైద్యం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వ వైద్యారోగ్యశాఖ కొవిడ్‌-19 కాల్ సెంటర్ ను ప్రారంభించింది. కరోనా బాధితులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటానికి కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ కాల్ సెంటర్ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం ఈ టెలీ మెడిసిన్ సేవలను కరోనా బారిన పడి ఆస్పత్రుల్లో కాకుండా హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్న వారి కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కాల్ సెంటర్ ద్వారా పాజిటివ్ వచ్చి ఇంటి వద్దే ఉంటూ చికిత్స తీసుకుంటున్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర అంశాలపై కౌన్సిలింగ్ ద్వారా తెలియజేస్తున్నది. ప్రభుత్వం ఈ సేవలను ఉచితంగా అందిస్తోంది. ఎటువంటి సందేహాలు వచ్చిన 1800 599 4455 కు కాల్ చేయవచ్చు. సాధారణ పరిస్థితులలో రోజు వారిగా 17 రోజుల పాటు కాల్ సెంటర్ నుంచి ఫోన్లు చేస్తూ ఎప్పటికప్పుడు బాధితుల ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories