Munugode By-Poll: ఇవాళ వెలువడనున్న మునుగోడు ఓటరు తీర్పు..!

counting will start soon
x

ఇవాళ వెలువడనున్న మునుగోడు ఓటరు తీర్పు

Highlights

* ఉదయం తొమ్మిది గంటలకు తొలిఫలితం.. మధ్యాహ్నం ఒంటిగంటకు సంపూర‌్ణ ఫలితం

Munugode: రాజకీయ పార్టీలన్నీ మునుగోడు ఫలితంకోసం ఎదురు చూస్తున్నాయి. నల్గొండ ఆర్జాలంబావి గోదాముల ఆవరణలో మునుగోడు ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి వివాదాలు చోటుచేసుకోకుండా పకడ్బందీగా కౌంటింగ్ నిర్వహించేందుకు అధికారులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటుచేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద కేంద్ర, రాష్ట్ర బలగాలతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.

రసవత్తరంగా సాగిన మునుగోడు ఉపఎన్నిక ఫలితాలు రాజకీయ పక్షాలకు అగ్నిపరీక్షగా నిలిచింది. హోరాహోరీగా సాగిన పోరులో మూడు రాజకీయ పార్టీలు హోరాహోరీ పోరుకు తలపడ్డాయి. ఇవాళ ఎన్నిక ఫలితాల వెలువడుతున్నప్పటికీ మూడు పార్టీల నేతలు విజయం తమదంటేతమదేనని ధీమా వ్యక్తంచేస్తున్నాయియి.

మునుగోడు నియోజకవర్గంలో ఏడు మండలాల్లోని ఓటర్లు తమతీర్పును ఎలక్ట్రానిక్‌ ఓటింగ్ మెషిన్లలో నిక్షిప్తంచేశారు. మునుగోడు నియోకవర్గంలో మొత్తం 2,41,805 ఓట్లు ఉండగా అందులో 2,25,192 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో 1,13,853 మంది పురుషులు, 1,11,338 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో కంటే ఈ సారి మునుగోడులో రికార్డు స్థాయిలో 93.13 శాతం ఓటింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో 91 శాతమే మునుగోడులో ఓటింగ్ నమోదవ్వగా. ఈ సారి ఆ రికార్డును అధిగమించింది. దీంతో మునుగోడు ఉపఎన్నిక ఫలితంపై రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది.

అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతిల మధ్య త్రిముఖపోరుకు మునుగోడు వేదికగా నిలిచింది. మూడు పార్టీలు విజయధీమాతో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఇంతకీ మునుగోడు ఓటరు ఎవరిని విజేతగా ఎన్నుకున్నాడోనని ఈరోజు తేలనుంది. మండలాలవారీగా ఓట్లలెక్కింపు చేపట్టబోతున్నారు. తొలుత చౌటుప్పల్ మండలంలోని ఓట్లను తొలుత లెక్కించనుండగా తర్వాత వరుసగా సంస్థాన్ నారాయణపూర్, మునుగోడు, మర్రిగూడ, నాంపల్లి, గట్టుప్పల్ మండలాల ఓట్లను లెక్కించనున్నారు.

ఈరోజు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. బరిలో నిలిచిన రాజకీయ పార్టీల అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో కౌంటింగ్ జరుగుతుంది. మునుగోడు నియోజకవర్గంలో ఏడు మండలాల ఓట్లను లెక్కించేందుకు మొత్తం 21 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 15 రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఉదయం 9 గంటల కల్లా తొలి ఫలితం వచ్చే అవకాశఉంది.. తుది ఫలితం మధ్యాహ్నాం ఒంటిగంట కల్లా పూర్తిస్థాయి ఫలితం వెలువడుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories