RTC Strike: తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకు కౌంట్‌డౌన్..7 నుంచి సమ్మె సైరన్

Countdown to RTC strike in Telangana starts from 7 Strike siren
x

RTC Strike: తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకు కౌంట్‌డౌన్..7 నుంచి సమ్మె సైరన్

Highlights

RTC Strike: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో సమ్మె సైరన్ మోగించేందుకు కార్మికులు సిద్ధం అవుతున్నట్లు కరీంనగర్ రీజినల్ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఎంపీ...

RTC Strike: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో సమ్మె సైరన్ మోగించేందుకు కార్మికులు సిద్ధం అవుతున్నట్లు కరీంనగర్ రీజినల్ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఎంపీ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ఆర్టీసీ కార్మికుల ప్రధాన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ..ఈనెల 7వ తేదీ నుంచి కార్మికులు సమ్మెబాట పడుతున్నట్లు తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని..యూనియన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కారుణ్య నియామకాలు చేపట్టినవారిని రెగ్యులర్ పద్ధతిలో తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించి, ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీ సంస్థకు అప్పజెప్పాలన్నారు.

ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమవడంతో ఈ నెల 7వ తేదీ నుంచి ఉదయం 6గంటల నుంచి బస్సులు ఎక్కడిక్కడ నిలిచిపోనున్నాయి. అయితే ఇప్పటికే ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. 5,6 తేదీల్లో కార్మిక సంఘాలు ఎప్పుడైనా చర్చలకు రావచ్చని మంత్రి తెలిపారు. 5వ తేదీన మంత్రితో ఆర్టీసీ జేఏసీ భేటీ అయ్యే అవకాశం ఉంది. సమస్యలపై క్లారిటీ రానట్లయితే వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కార్మికులు తేల్చి చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories