ఆదిలాబాద్ జిల్లా కళ్యాణలక్ష్మి పథకంలో తవ్వినకొద్ది బయటపడుతున్న అవినీతి దందా!

ఆదిలాబాద్ జిల్లా కళ్యాణలక్ష్మి పథకంలో తవ్వినకొద్ది బయటపడుతున్న అవినీతి దందా!
x
Highlights

ఆదిలాబాద్ జిల్లాలో కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్ అవినీతి దందాలో తవ్వినకోద్ది బయటపడుతోంది.

ఆధార్ కార్డు ఆధారాలు లేవు.. పెళ్లి ఫోటోలు లేవు. డూబ్లికేట్ రేషన్ కార్డులు.. అయినా సరే కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ వచ్చేస్తుంది. అదేలా అనుకుంటున్నారా అంతే.. వారు తలుచుకుంటే చాలు కళ్యాణ లక్ష్మి వస్తుంది. తప్పుడు పత్రాలతో అధికారులను తప్పుదారి పట్టించారు. కోట్ల రూపాయల పేద ఆడబిడ్డల కళ్యాణ లక్ష్మి నిధులు హాం ఫట్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో అధికారుల విచారణలో తవ్విన కొద్ది బయటపడుతున్నా కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్ అవినీతి దందాపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్..

ఆదిలాబాద్ జిల్లాలో కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్ అవినీతి దందాలో తవ్వినకోద్ది బయటపడుతోంది. ఈ అవినీతి రెవెన్యూ అధికారులు, మరోవైపు పోలీసులు విచారిస్తున్నారు. కేసు విచారిస్తున్న కొద్ది సంచలనాత్మకమైన అంశాలు బయటపడుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో జాదవ్ శ్రీనివాస్, అచ్యుత్‌లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆర్డీఓ కార్యాలయంలో పని చేస్తున్న నదీమ్, మరో ముగ్గురిపై కూడా కేసు నమోదు చేశారు.

ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 24 బోగస్ లబ్దిదారులను పోలీసులు గుర్తించారు. విచారిస్తున్న కొద్ది బోగస్ సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటి వరకు 113 మంది బోగస్ లబ్దిదారుల పేర్లతో అక్రమార్కులు ప్రభుత్వ సొమ్ము మింగారని విచారణలో వెల్లడైంది.

బోథ్ నియోజకవర్గంలో ఈ కుంభకోణం ఎక్కువగా జరిగిందని వెల్లడైంది. జనవరి నుంచి ఇది జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా మంజూరైన కళ్యాణ లక్ష‌్మి, షాదిముబారక్ లబ్ధిదారుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. బోగస్ లబ్దిదారుల పేర్లతో తీసుకున్న డబ్బులు ఎవరి ఖాతాలో పోయాయానేది విచారిస్తున్నారు. సుమారు ఐదు కోట్ల వరకు ఈ కుంభకోణం జరిగి ఉండవచ్చని ప్రతిపక్షలు ఆరోపిస్తున్నాయి.

పేదలకు దక్కాల్సిన పథకం.. ఇలాంటి అవినీతి అధికారులు దారి మళ్లీ చేస్తున్న చిక్కి.. దక్కాల్సిన లబ్దిదారులకు దక్కకుండా పోతుంది. ఇప్పటికైనా దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. మరి ఈకేసులో ఇంకా ఎంతమంది అధికారులు బయట పడతారో చూడాలి.. మరిఈకేసులో ఇంకా ఎంతమంది అవినీతి దోంగల గుట్టుబయటపడుతోంది చూడాలి .


Show Full Article
Print Article
Next Story
More Stories