Coronavirus: తెలంగాణలో కొత్తగా ఆరు పాజిటివ్ కేసులు

Coronavirus: తెలంగాణలో కొత్తగా ఆరు పాజిటివ్ కేసులు
x
Representational Image
Highlights

తెలంగాణలో ఇవాళ కొత్తగా ఆరు కరోనా వైరస్ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో ఇవాళ కొత్తగా ఆరు కరోనా వైరస్ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 1009కి చేరినట్లు మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. ఇప్పటివరకు 374మంది కోలుకున్నారు. ఈ వైరస్‌ బారిన పడి 25 మంది మృతి చెందారు.

ఈ ఒక్క రోజే 42మంది డిశ్చార్జి అయినట్టు మంత్రి చెప్పారు. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 610మంది బాధితులు చికిత్స పొందుతున్నారని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 50శాతానికి పైగా కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదైనట్టు వెల్లడించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories