Coronavirus updates in Telangana: తెలంగాణలో కొత్తగా 2,932 పాజిటివ్ కేసులు..

Representational Image
Coronavirus updates in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది.
Coronavirus updates in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 2,932 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,17,415కి చేరింది. మృతుల సంఖ్య 799కి పెరిగింది. మరోవైపు నిన్న1580 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 87,675కి చేరింది.
ప్రస్తుతం 28,942 మంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 22,097 మంది ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.68 ఉందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కోలుకున్న వారి రేటు 75.2కు చేరుకుంది. జీహెచ్ఎంసీలో - 520, కరీంనగర్- 168, ఖమ్మం 141, మహబూబాబాద్- 67మంచిర్యాల- 110, మేడ్చెల్- 218, నల్గొండ- 159, నిజామాబాద్- 129, రంగారెడ్డి- 218, సిద్దిపేట- 100 వరంగల్ అర్బన్- 80 కేసులు నమోదయ్యాయి.