Coronavirus Updates in Telangana: తెలంగాణలో కొత్తగా 2,924 పాజిటివ్ కేసులు...

X
Highlights
Coronavirus Updates in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది.
S. Srikanth30 Aug 2020 4:04 AM GMT
Coronavirus Updates in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 2,924 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,23,090కి చేరింది. మృతుల సంఖ్య 818కి పెరిగింది. నిన్న ఒక్క రోజే 1,638 కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 90,988కి చేరింది.ప్రస్తుతం 31,284 మంది చికిత్స వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.
తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.68 ఉందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కోలుకున్న వారి రేటు 75.2కు చేరుకుంది. జీహెచ్ఎంసీలో - 461, రంగారెడ్డి- 213, మేడ్చెల్- 153, కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు తెలంగాణాలో 13,27,791 కరోనా పరీక్షలు చేయడం జరిగింది.
Web TitleCoronavirus Updates in Telangana 2924 New cases Registered in Last 24 Hours
Next Story