తెలంగాణలో మరోసారి పెరిగిన కరోనా కేసులు

తెలంగాణలో మరోసారి పెరిగిన కరోనా కేసులు
x
Representational Image
Highlights

తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గినట్లు తగ్గి మళ్ళీ పెరుగుతున్నాయి. గురువారం రాష్ట్రంలో కొత్తగా మరో 117 కరోనావైరస్ పాజిటివ్...

తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గినట్లు తగ్గి మళ్ళీ పెరుగుతున్నాయి. గురువారం రాష్ట్రంలో కొత్తగా మరో 117 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో సౌదీ అరేబియా నుంచి వచ్చిన వారిలో 49 మందికి కరోనా సోకినట్టు గుర్తించగా.. రాష్ట్రంలో 66 మందికి, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలోనూ ఇద్దరికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలింది.

దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనావైరస్ పాజిటివ్ సోకిన వారి సంఖ్య మెత్తం 2215 కి చేరింది. అలాగే కొత్తగా 4 మరణాలు కూడా సంభవించాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనావైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 67 కి చేరింది.. ఇదిలావుంటే గురువారం నాటికి 844 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో కోలుకుని డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 1345 గా ఉంది.



Show Full Article
Print Article
Next Story
More Stories