Etela Rajender: కాకతీయ మెడికల్‌ కాలేజీలో కరోనా నిర్ధారిత కేంద్రం

Etela Rajender: కాకతీయ మెడికల్‌ కాలేజీలో కరోనా నిర్ధారిత కేంద్రం
x
Etela Rajender (File Photo)
Highlights

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలందరినీ భయాందోళనకు గురి చేస్తుంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ప్రపంచంలోని అన్నిదేశాలకు విస్తరిస్తుంది. ఇదే కోణంలో భారతదేశంలోనూ, అదే విధంగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంట్రీ ఇచ్చింది కోవిడ్ -19.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలందరినీ భయాందోళనకు గురి చేస్తుంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ప్రపంచంలోని అన్నిదేశాలకు విస్తరిస్తుంది. ఇదే కోణంలో భారతదేశంలోనూ, అదే విధంగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంట్రీ ఇచ్చింది కోవిడ్ -19. కాగా ఈ వైరస్ మరింత విస్తరించకుండా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటున్నారు. అందులో భాగంగానే విదేశాల నుంచి వచ్చే వారికి విమానాశ్రయాలలోనే స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్ నగరంలోని కొన్ని ఆస్పత్రులలో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసారు. అదే విధంగా నగరంలోని గాంధీ హాస్పిటల్ లో కరోనా నిర్ధారణా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసారు. అంతే కాకుండా వైరస్ సోకిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదే విధంగా వైరస్ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాలపై ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది.

ఇన్నిజాగ్రత్తలు తీసుకున్న ప్రభుత్వం వైరస్ బారిన ప్రజలు పడకుండా మరి కొత్త పద్ధతులను అవలంబిస్తుంది. అందులో భాగంగానే హెపా ఫిల్టర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నగరంలోని గాంధీ, ఉస్మానియా, ఫీవర్, ఛాతీ ఆస్పత్రుల్లో ఒక్కో ఫిల్టర్‌ ఏర్పాటుచేయని నిర్ణయానికొచ్చింది. కరోనా వైరస్ సోకిన వ్యక్తులను గదిలో ఉంచినప్పుడు ఆ వైరస్, బ్యాక్టిరియా గదిలో విస్తరిస్తుందని ఈ హెపా ఫిల్టర్లను ఏర్పాటు చేస్తే అవి వైరస్ ను చంపి స్వచ్ఛమైన గాలిని బయటికి పంపిస్తాయని వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు.

ఈ ఫిల్టర్ల ఖరీదు ఒక్కోటి రూ.1.5 కోట్లు ఉంటుందని. అయినప్పటికీ వాటిని కొనుగోలు చేస్తామని తెలిపారు. వైరస్ సోకిన వ్యక్తులు గదిలో ఉన్నప్పుడు వైరస్, బ్యాక్టీరియా ఉంటుందని, అలాంటి సమయంలో ఎవరైనా కిటికీలు తెరిస్తే ఆ వైరస్‌ బయటకు విస్తరించే అవకాశముందని ఆయన వెల్లడించారు. ఈ ఫిల్టర్లను గనుక ఏర్పాటు చేస్తే అప్పుడు ఆస్పత్రుల ఆవరణలో ఉన్నవారు ఎలాంటి భయాందోళనకు గురికావలసిన అవసరం లేదన్నారు.

ఇక రాష్ర్రంలో గాంధీ, ఉస్మానియాలో కోవిడ్‌ నిర్ధారణకు పరీక్ష కేంద్రాలు ఉన్నాయని, మరి కొన్ని కేంద్రాలని వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ కాలేజీ, హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్, పీవర్‌ ఆస్పత్రుల్లోనూ ఏర్పాటు చేసేందుకు కేంద్రం అనుమతించిందని వెల్లడించారు. మరో వారం రోజుల్లో ఈ ల్యాబ్‌లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అదే కోణంలో ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో గురువారం నుంచి కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు మొదలుపెడతామని ఆయన స్పష్టం చేసారు. దాంతో పాటుగానే మరికొన్ని జిల్లా కేంద్రాల్లోని జిల్లా ఆస్పత్రుల్లో ఐసోలేషన్, ఐసీయూ కేంద్రాలను శాశ్వత పద్ధతి లో ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు.

ఇప్పటి వరకూ ప్రజలకు అందుబాటులో ఉన్న 104 కాల్‌ సెంటర్‌తో పాటు 108 కాల్‌ సెంటర్‌లు కరోనా లక్షణాలు ఉన్న వారికి సాయం చేస్తాయని తెలిపారు. సీనియర్ ఐఏఎస్‌ అధికారి శ్రీదేవి కోవిడ్‌ వైరస్‌ ఎదుర్కొనేందుకు ప్రొక్యూర్‌మెంట్‌ కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తారన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories