Coronavirus: మెట్రో రైలు..కరోనా కేర్

Coronavirus: మెట్రో రైలు..కరోనా కేర్
x
మెట్రో రైలు..కరోనా కేర్
Highlights

హైదరాబాద్‌లో కరోనా వైరస్‌ తొలికేసు నమోదవ్వడంతో అన్ని వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మెట్రో రైలు ప్రయాణికులు ఒకింత కలవరపడుతున్నారు. మెట్రో పూర్తిగా...

హైదరాబాద్‌లో కరోనా వైరస్‌ తొలికేసు నమోదవ్వడంతో అన్ని వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మెట్రో రైలు ప్రయాణికులు ఒకింత కలవరపడుతున్నారు. మెట్రో పూర్తిగా ఏసీ ప్రయాణం ఎక్కగానే డోర్లన్నీ మూసుకుపోతాయి. రద్దీ నేపథ్యంలో ఎవరైనా జలుబుతో బాధపడుతూ తుమ్మినా, దగ్గినా తుంపర్లన్నీ మెట్రో లోపలే. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో శుభ్రత చర్యలతో పాటూ రద్దీవేళల్లో ట్రిప్పుల సంఖ్యను మరింత పెంచితే తమ ఆరోగ్యాన్ని కాపాడినవారు అవుతారని ప్రయాణికులు అంటున్నారు.

మెట్రో రైలు నడుస్తున్న మూడు మార్గాల్లో హైదరాబాద్‌ మెట్రో నిత్యం వెయ్యి ట్రిప్పులను నడుపుతోంది. ప్రతిరోజు సగటున నాలుగు లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు మధ్య ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటోంది. ఆ సమయంలో ఒక మెట్రో రైలులో సగటున వెయ్యిమంది వరకు ఉంటున్నారు. ఇదే ఇప్పుడు వారిని కలవరపెడుతోంది. దీంతో కొంతమంది మెట్రో ప్రయాణాన్ని విరమించుకుని సొంత వాహనాలవైపు మళ్లుతున్నారు.

ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మెట్రో అధికారులు చెబుతున్నారు. ప్రతిరోజు రాత్రి మెట్రోరైళ్లు డిపోకు చేరాక ప్రతి రైలును స్టెరిలైజ్‌ చేసి, అధికారి ధ్రువీకరించాకే ట్రాక్‌పైకి పంపిస్తున్నామని అధికారులు తెలిపారు. కరోనా నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరిస్తున్నారు. మెట్రోస్టేషన్లు, రైళ్లు, చేతులు తగిలే ప్రాంతాలు, ఎస్కలేటర్లు, హ్యాండ్‌ రైల్స్‌ ఎప్పటికప్పుడు శుభ్రపర్చడం, మెట్రో డిపోకు చేరాక సబ్బు, డిటర్జెంట్లతో కడగడం చేస్తున్నామన్నారు. ప్రయాణికులను అప్రమత్తం చేసేలా త్వరలోనే మైకులో ప్రకటనలు, చిత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories